కేకేఆర్ కొత్త కెప్టెన్ అతడేనా..?
Russell leads training at KKR camp. టీ20 మ్యాచ్ లలో ఆండ్రీ రస్సెల్ సూపర్ స్టార్. భారీ షాట్స్ తో విరుచుకుపడుతూ మ్యాచ్ విన్నర్‌గా పేరు తెచ్చుకున్నాడు
By M.S.R Published on 25 March 2023 8:45 PM ISTRussell leads training at KKR camp
టీ20 మ్యాచ్ లలో ఆండ్రీ రస్సెల్ సూపర్ స్టార్. భారీ షాట్స్ తో విరుచుకుపడుతూ మ్యాచ్ విన్నర్‌గా పేరు తెచ్చుకున్నాడు. IPL ప్రారంభానికి ఇంకా వారం కంటే తక్కువ సమయం ఉన్నందున, కోల్‌కతా నైట్ రైడర్స్ ఈ సీజన్‌కు తమ కెప్టెన్‌ను ఇంకా ప్రకటించలేదు. గాయం కారణంగా శ్రేయాస్ అయ్యర్ టోర్నమెంట్ నుండి తప్పుకున్నాడు. దీంతో అతని స్థానంలో ఎవరు కెప్టెన్ అవుతారా అనే సస్పెన్స్ అందరినీ వెంటాడుతూ ఉంది. తాజాగా ఆండ్రీ రస్సెల్ ను కెప్టెన్ గా చేసే అవకాశాలు లేకపోలేదనే ప్రచారం కూడా సాగుతోంది. ఎన్నో టోర్నమెంట్ లను ఆడిన రస్సెల్ అనుభవం కూడా అతడిని కెప్టెన్ చేసే అవకాశాన్ని మరింత ఎక్కువ చేసింది. ఇక ఆల్‌రౌండర్ సునీల్ నరైన్, షకిబుల్ హసన్ కెప్టెన్సీ రేసులో ఉన్నారు. నరైన్ ఈమధ్యే ఐఎల్‌టీ20లో అబూదాబీ నైట్‌రైడర్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. షకిబుల్ కు కూడా కెప్టెన్ గా చేసిన అనుభవం ఉంది. వీరందరినీ కాదని ఎవరైనా కొత్త వ్యక్తిని కెప్టెన్ గా చేస్తారా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది.
IPL 2023 కోసం KKR జట్టు: శ్రేయాస్ అయ్యర్ (సి), నితీష్ రాణా, రహ్మానుల్లా గుర్బాజ్, వెంకటేష్ అయ్యర్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, లాకీ ఫెర్గూసన్, ఉమేష్ యాదవ్, టిమ్ సౌథీ, హర్షిత్ సింగ్ రాణా, వరుణ్ చక్రవర్తి, అనుకుల్ రాయ్, రింకూ సింగ్, ఎన్. జగదీసన్, వైభవ్ అరోరా, సుయాష్ శర్మ, డేవిడ్ వీస్, కుల్వంత్ ఖేజ్రోలియా, లిట్టన్ దాస్, మన్‌దీప్ సింగ్, షకీబ్ అల్ హసన్.
ఐపీఎల్-16వ సీజన్ మార్చి31 నుంచి ప్రారంభం అవుతుండగా, కేకేఆర్ తమ తొలి మ్యాచ్‌లో ఏప్రిల్ 2న పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది.