నిప్పులు చెరిగిన ఆర్సీబీ బౌల‌ర్లు.. రాజ‌స్థాన్‌ 59 పరుగులకే ఆలౌట్‌

Royal Challengers Bangalore won by 112 runs Against Rajasthan Royals. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో జ‌రిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ బౌలర్ల ధాటికి

By Medi Samrat  Published on  14 May 2023 6:30 PM IST
నిప్పులు చెరిగిన ఆర్సీబీ బౌల‌ర్లు.. రాజ‌స్థాన్‌ 59 పరుగులకే ఆలౌట్‌

జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో జ‌రిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ బౌలర్ల ధాటికి రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ ఆర్డర్ పేక మేడ‌లా కుప‌ప‌కూలింది. 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ జట్టు 59 పరుగులకే ఆలౌట్ అయింది. జట్టులోని నలుగురు బ్యాట్స్‌మెన్ ఖాతా కూడా తెరవకుండ అవుట‌య్యారు. బౌలర్ల అద్భుత ప్రదర్శనతో ఆర్సీబీ 112 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసింది.

ఆర్సీబీ బౌలర్లకు రాజస్థాన్ బ్యాట్స్‌మెన్ పూర్తిగా లొంగిపోయారు. స్టార్ బ్యాట్స్‌మెన్‌ల‌తో కూడిన‌ రాజస్థాన్ బ్యాటింగ్ ఆర్డర్ బెంగళూరు ఫాస్ట్ బౌలర్ల ముందు నిల‌వ‌లేక‌పోయింది. యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్ ఖాతా కూడా తెరవబడలేదు. సంజూ శాంసన్ చెత్త షాట్ ఆడి పెవిలియ‌న్ చేరాడు. హిట్‌మెయిర్‌(33) ఒక్క‌డే ప‌ర్వాలేద‌నిపించ‌గా.. జట్టు 59 పరుగులకే కుప్పకూలింది. ఆర్సీబీ బౌల‌ర్ల‌లో పార్నెల్ మూడు వికెట్లు ప‌డగొట్ట‌గా, క‌ర్న్ శ‌ర్మ, బ్రాస్‌వెల్ రెండేసి వికెట్లు ద‌క్కించుకున్నారు. సిరాజ్, మాక్స్‌వెల్ కూడా త‌లా ఒక వికెట్ చొప్పున త‌మ ఖాతాలో వేసుకున్నారు.




Next Story