Video : డగౌట్‌లో కూర్చొని మ్యాచ్‌ను మ‌లుపు తిప్పిన రోహిత్‌..!

ఢిల్లీపై ముంబై గెలిచిన తర్వాత ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన కర్ణ్ శర్మ వార్త‌ల్లో నిలిచాడు.

By Medi Samrat
Published on : 14 April 2025 12:30 PM IST

Video : డగౌట్‌లో కూర్చొని మ్యాచ్‌ను మ‌లుపు తిప్పిన రోహిత్‌..!

ఢిల్లీపై ముంబై గెలిచిన తర్వాత ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన కర్ణ్ శర్మ వార్త‌ల్లో నిలిచాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై 12 పరుగుల తేడాతో విజయం సాధించడంలో కర్ణ్ కీలక పాత్ర పోషించాడు. అతను 3 వికెట్లు తీసి ఢిల్లీ నుండి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు. ముంబై విజయం తర్వాత అందరూ కర్ణ్ శర్మను కొనియాడుతున్నారు.. అయితే ఈ విజయంలో డగౌట్‌లో కూర్చున్న రోహిత్ శర్మ పాత్ర చాలా తక్కువ మందికి తెలుసు. ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. అందులో రోహిత్ కర్ణ్‌కు డగౌట్‌లో కూర్చొని కొన్ని సూచనలు ఇస్తున్నాడు.. రోహిత్‌ సలహా ప్రకారం.. కర్ణ్‌ మొత్తం గేమ్‌ను తలకిందులు చేశాడు.

డగౌట్‌లో కూర్చున్న రోహిత్‌.. బంతిని మార్చమని కర్ణ్‌కు సంకేతాలు ఇచ్చాడు. ఈ సంఘటన ఢిల్లీ ఇన్నింగ్స్ 14వ ఓవర్‌లో జరిగింది..డగౌట్‌లో కూర్చున్న రోహిత్ బంతిని మార్చమని కర్ణ్‌కి సూచించాడు. IPL కొత్త నిబంధనల ప్రకారం.. బౌలింగ్ జట్టు రాత్రి మ్యాచ్‌లో 10 ఓవర్ల తర్వాత బంతిని మార్చడానికి అవకాశం ఉంది. ముంబై జట్టు కూడా బంతిని మార్చమని కోరింది. కర్ణ్ కొత్త బంతితో మ్యాజిక్ చేశాడు. ఒక్కో ఓవర్‌లో ఢిల్లీ జట్టు 11 పరుగులకు పైగా స్కోర్ చేసింది. బంతి మార్చిన తర్వాత 24 బంతుల్లో 22 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ తర్వాత 19వ ఓవర్‌లో వరుసగా 3 రనౌట్‌లు అవడంతో ఢిల్లీ ఇన్నింగ్స్ 193 పరుగుల వద్ద ముగిసింది.


Next Story