Viral Video : కోట్లాది మంది భారతీయుల హృదయాలను గెలుచుకున్న రోహిత్.. ఏం చేశాడో చూడండి..!

వాంఖడే స్టేడియం 50వ వార్షికోత్సవం సందర్భంగా భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఛాంపియన్స్ ట్రోఫీతో పోజులిచ్చాడు.

By Medi Samrat  Published on  20 Jan 2025 9:18 AM IST
Viral Video : కోట్లాది మంది భారతీయుల హృదయాలను గెలుచుకున్న రోహిత్.. ఏం చేశాడో చూడండి..!

వాంఖడే స్టేడియం 50వ వార్షికోత్సవం సందర్భంగా భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఛాంపియన్స్ ట్రోఫీతో పోజులిచ్చాడు. ఈ కార్యక్రమానికి ముంబై క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి కూడా హాజరయ్యారు. ఫోటోషూట్ సమయంలో కోట్లాది మంది భారతీయుల హృదయాలను గెలుచుకున్న రోహిత్ ఏం చేశాడో తెలుసుకుందాం.

ఛాంపియన్స్ ట్రోఫీ ద‌గ్గ‌ర‌కు రావాలని మాజీ క్రికెటర్లు రోహిత్‌ను కోరగా.. దిగ్గజాలను కూడా ఆకట్టుకునే విధంగా రోహిత్ నిరాకరించాడు. దిగ్గజ క్రికెటర్లందరినీ ట్రోఫీతో ఫొటోలు దిగాల్సిందిగా కోరాడు. రోహిత్ చేసిన ఈ ప‌ని అభిమానుల హృదయాలను ఆనందపరిచింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వైరల్ వీడియోలో.. సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి.. రోహిత్ శర్మను ఛాంపియన్స్ ట్రోఫీ దగ్గరకు రమ్మని కోరడం చూడవచ్చు.. అయితే రోహిత్ వారి ఆహ్వానాన్ని మర్యాదపూర్వకంగా తిరస్కరించాడు. వేదిక మధ్యలోకి రావాలని సీనియర్ ఆటగాళ్లను కోరాడు. సచిన్ టెండూల్కర్, ర‌వి శాస్త్రి, గవాస్కర్ ట్రోఫీ వెనుక కుడివైపు పోజులివ్వగా, రోహిత్ వేదికకు ఎడమవైపున నిలిచాడు. రవిశాస్త్రికి రోహిత్ మంచి గౌరవం ఇచ్చాడు. దిగ్గ‌జ‌ ఆటగాళ్లందరూ కుర్చీలపై కూర్చోగా, రవిశాస్త్రి పక్కకు వెళ్లి కూర్చున్నాడు.. అయితే రోహిత్.. రవిశాస్త్రిని సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్‌లతో మధ్యలో కూర్చోమని కోరాడు. అప్ప‌డు ర‌విశాస్త్రి ప‌క్క‌న రోహిత్‌ కూర్చున్నాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి.

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 (ICC ఛాంపియన్స్ ట్రోఫీ) ఫిబ్రవరి 19 నుండి ప్రారంభం కానుంది. పాకిస్తాన్‌తో రాజకీయ సమస్యలు, భద్రతా కారణాల వల్ల, టీమ్ ఇండియా అన్ని మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడుతుంది.

రోహిత్ మాట్లాడుతూ.. ఛాంపియన్స్ ట్రోఫీని భార‌త్‌కు తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తానని చెప్పాడు. ఫిబ్రవరి 20న‌ ఛాంపియన్స్ ట్రోఫీలో టీమ్ ఇండియా తన మొద‌టి మ్యాచ్ ఆడుతుంది. బంగ్లాదేశ్‌తో భారత్‌ తొలి మ్యాచ్‌ ఆడనుంది. ఫిబ్రవరి 23న పాకిస్థాన్‌తో భారత్ తలపడనుంది.

Next Story