బ్రేకింగ్‌.. సెమీస్‌కు ముందు టీమ్ఇండియాకు భారీ షాక్‌.. హిట్‌మ్యాన్‌కు గాయం..!

Rohit Sharma Sustains Forearm Injury In Nets Ahead Of T20 World Cup Semi Final.ప్రాక్టీస్ సెష‌న్‌లో రోహిత్ గాయ‌ప‌డ్డాడు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 Nov 2022 7:53 AM IST
బ్రేకింగ్‌.. సెమీస్‌కు ముందు టీమ్ఇండియాకు భారీ షాక్‌.. హిట్‌మ్యాన్‌కు గాయం..!

ఆస్ట్రేలియా వేదిక‌గా జ‌రుగుతున్న టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో టీమ్ఇండియా సెమీస్‌కు దూసుకువెళ్లిన సంగ‌తి తెలిసిందే. గురువారం సెమీఫైన‌ల్‌లో బ‌ల‌మైన ఇంగ్లాండ్‌తో భార‌త జ‌ట్టు త‌ల‌ప‌డ‌నుంది. ఈ క్ర‌మంలో టీమ్ఇండియా ఆట‌గాళ్లు నెట్స్‌లో క‌ష్ట‌ప‌డుతున్నారు. అయితే.. ఈ మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియాకు గ‌ట్టి షాక్ త‌గిలింది.

మంగ‌ళ‌వారం అడిలైడ్‌లో ప్రాక్టీస్ సెష‌న్‌లో కెప్టెన్ రోహిత్ శ‌ర్మ గాయ‌ప‌డ్డాడు. నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్‌ చేస్తుండ‌గా రోహిత్ శ‌ర్మ కుడి చేతికి గాయ‌మైంది. బాధ‌తో రోహిత్ శ‌ర్మ విల‌విల‌లాడిపోయాడు. వెంట‌నే నెట్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేశాడు. అత‌డి కుడి ముంచేతికి పెద్ద ఐస్ ప్యాక్ క‌ట్టుకుని క‌నిపించాడు. రోహిత్‌తో మెంట‌ల్ కండిష‌నింగ్ కోచ్ ప్యాడీ ఆప్ట‌న్ చాలా సేపు మాట్లాడ‌డం క‌నిపించింది.

అత‌డి గాయంపై టీమ్ మేనేజ్‌మెంట్ ఇంకా ఎలాంటి స‌మాచారాన్ని అందించ‌లేదు. రోహిత్‌కు స్కానింగ్ నిర్వ‌హించే అవ‌కాశం ఉంది. ఒక‌వేళ గాయం తీవ్ర ఎక్కువ‌గా ఉంటే.. గురువారం ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌కు దూరం అయ్యే అవ‌కాశం ఉంది. ఒక‌వేళ అదే జ‌రిగితే టీమ్ఇండియా ఇది పెద్ద ఎదురుదెబ్బ‌గానే చెప్ప‌వ‌చ్చు.

Next Story