రోహిత్ శ‌ర్మ‌కు గాయం.. మైదానం వీడి ఆస్ప‌త్రికి వెళ్లిన హిట్‌మ్యాన్‌

Rohit Sharma suffers blow to his thumb while fielding in 2nd ODI.టీమ్ఇండియా ప్ర‌స్తుతం బంగ్లాదేశ్ ప‌ర్య‌ట‌న‌లో ఉంది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 Dec 2022 8:51 AM GMT
రోహిత్ శ‌ర్మ‌కు గాయం.. మైదానం వీడి ఆస్ప‌త్రికి వెళ్లిన హిట్‌మ్యాన్‌

టీమ్ఇండియా ప్ర‌స్తుతం బంగ్లాదేశ్ ప‌ర్య‌ట‌న‌లో ఉంది. బుధ‌వారం ఢాకాలోని మిర్‌పూర్ వేదిక‌గా భార‌త్‌, బంగ్లాదేశ్‌ల మ‌ధ్య రెండో వ‌న్డే జ‌రుగుతోంది. ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియాకు కెప్టెన్ రోహిత్ శ‌ర్మ భారీ షాకిచ్చాడు. ఫీల్డింగ్ చేస్తూ గాయ‌ప‌డ్డాడు. అత‌డి బొట‌న‌వేలుకి తీవ్ర‌మైన గాయం కావ‌డంతో వెంట‌నే మైదానాన్ని వీడాడు. స్కానింగ్ కోసం అత‌డిని బీసీసీఐ వైద్య బృందం ఆస్ప‌త్రికి త‌ర‌లించింది.

బంగ్లా ఇన్నింగ్ రెండో ఓవ‌ర్‌లోనే ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. సిరాజ్ వేసిన ఈ ఓవ‌ర్‌లోని నాలుగో బంతిని అనాముల్ హ‌క్ భారీ షాట్ ఆడాడు. అయితే.. బంతి ఎడ్జ్ తీసుకుంది. సెకండ్ స్లిప్‌లో ఉన్న హిట్‌మ్యాన్ క్యాచ్ ప‌ట్టుకునేందుకు య‌త్నించాడు. ఈ క్ర‌మంలో అత‌డి బొట‌న‌వేలికి గాయ‌మైంది. వెంట‌నే అత‌డు మైదానాన్ని వీడాడు. అత‌డి స్థానంలో ర‌జ‌త్ ప‌టీదార్ ఫీల్డింగ్‌కు వ‌చ్చాడు.

రోహిత్ శ‌ర్మ గాయంపై భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) అప్‌డేట్ ఇచ్చింది. "రోహిత్ బొట‌న‌వేలికి గాయ‌మైంది. స్కానింగ్ కోసం అత‌డిని ఆస్ప‌త్రికి తీసుకువెళ్లారు. బీసీసీఐ వైద్య సిబ్బంది అత‌డి ప‌రిస్థితిని అంచ‌నా వేస్తోంది "అని తెలిపింది.

ఇప్ప‌టికే సిరీస్‌లో 1-0తో వెనుక‌బ‌డిన భార‌త్ ఈ మ్యాచ్‌లో త‌ప్ప‌క గెల‌వాల్సిన ప‌రిస్థితి ఉంది. గాయం కార‌ణంగా రోహిత్ బ్యాటింగ్ చేయ‌లేక‌పోతే అది టీమ్ఇండియాకు గ‌ట్టి ఎదురుదెబ్బ‌గానే చెప్ప‌వ‌చ్చు.

Next Story
Share it