Viral Video : ఆ క్యాచ్‌తో అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచిన రోహిత్‌ శర్మ.. త‌న స్టైల్లో అభినందించిన పంత్‌..!

భారత్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండవ టెస్ట్ (IND vs BAN 2వ టెస్ట్) నాలుగో రోజు ఆట ప్రారంభ‌మైంది.

By Medi Samrat
Published on : 30 Sept 2024 1:53 PM IST

Viral Video : ఆ క్యాచ్‌తో అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచిన రోహిత్‌ శర్మ.. త‌న స్టైల్లో అభినందించిన పంత్‌..!

భారత్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండవ టెస్ట్ (IND vs BAN 2వ టెస్ట్) నాలుగో రోజు ఆట ప్రారంభ‌మైంది. నాలుగో రోజు సిరాజ్‌ భారత్‌కు తొలి వికెట్‌ను అందించాడు. బంగ్లాదేశ్‌ ఆటగాడు లిటన్‌ దాస్ క్యాచ్‌ని ఒంటి చేత్తో ప‌ట్టాడు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ. రోహిత్ అందుకున్న క్యాచ్ లిటన్ దాస్ ను కూడా ఆశ్చర్యపరిచింది. ఇది చూసి జట్టులోని ఇతర ఆటగాళ్లు కూడా ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, ఇందులో రోహిత్ గాలిలోకి ఎగిరి ఒక చేత్తో లిటన్ దాస్ క్యాచ్‌ను పట్టుకున్నాడు.

బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌లోని 50వ ఓవర్‌ను మహ్మద్ సిరాజ్ బౌలింగ్ చేయడానికి వచ్చాడు. ఈ ఓవర్ నాలుగో బంతికి క్రీజు నుంచి బయటకు వచ్చిన లిటన్ దాస్ మిడ్ ఆఫ్ మీదుగా బలమైన షాట్ ఆడాడు. మిడ్ ఆఫ్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మ గాలిలోకి ఎగిరి ఒంటి చేత్తో బంతిని అందుకున్నాడు. రోహిత్ క్యాచ్ చూసిన లిటన్ దాస్ ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేయ‌గా.. టీమ్ ఇండియా సంబరాల్లో మునిగింది.

వీడియోలో క్యాచ్ తీసుకున్న రోహిత్ చెవులను పంత్ లాగ‌డం కూడా చూడవచ్చు. అదే సమయంలో ప్రతి ఆటగాడు రోహిత్‌ క్యాచ్‌ను అభినందించ‌డానికి వ‌చ్చారు. కోచ్ గంభీర్ కూడా డ్రెస్సింగ్ రూమ్ నుంచి నవ్వుతూ కనిపించాడు.

Next Story