అతనిలాంటి ఆటగాళ్లు దొరకడం అరుదు.. ఆ స్టార్ స్పిన్న‌ర్‌పై రోహిత్ ప్ర‌శంస‌లు

మార్చి 7న ఇంగ్లండ్‌తో భారత జట్టు తన చివరి టెస్టు మ్యాచ్‌ను ఆడనుంది. ఈ మ్యాచ్‌లో ఆడ‌టం ద్వారా అనుభవజ్ఞుడైన స్పిన్నర్ అశ్విన్

By Medi Samrat  Published on  6 March 2024 11:49 AM GMT
అతనిలాంటి ఆటగాళ్లు దొరకడం అరుదు.. ఆ స్టార్ స్పిన్న‌ర్‌పై రోహిత్ ప్ర‌శంస‌లు

మార్చి 7న ఇంగ్లండ్‌తో భారత జట్టు తన చివరి టెస్టు మ్యాచ్‌ను ఆడనుంది. ఈ మ్యాచ్‌లో ఆడ‌టం ద్వారా అనుభవజ్ఞుడైన స్పిన్నర్ అశ్విన్ తన చారిత్రాత్మక టెస్ట్ మ్యాచ్ ఆడనున్నాడు. అశ్విన్ తన 100వ టెస్టు మ్యాచ్‌ని ధర్మశాలలో ఆడనున్నాడు. టెస్టు మ్యాచ్‌కు ముందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కెప్టెన్ రోహిత్ శర్మ.. అశ్విన్‌పై ప్రశంసలు కురిపించాడు.

భారత్ ఇప్పటికే సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 3-1 ఆధిక్యంలో ఉంది. చివరి మ్యాచ్‌లో విజయంతో భార‌త్‌ సిరీస్‌ ముగించాలనుకుంటోంది. అదే సమయంలో ఇంగ్లండ్ చివరి టెస్టు మ్యాచ్‌ను విజయంతో వీడ్కోలు పలకాలని భావిస్తోంది.

రోహిత్ మాట్లాడుతూ.. 100 టెస్టులు ఆడడం ఏ ఆటగాడికైనా పెద్ద ఘనత. అతను మాకు పెద్ద మ్యాచ్ విన్నర్ అయ్యాడు. అతను మన కోసం చేసిన వాటిని ప్ర‌శంసించ‌కుండా ఉండ‌లేం. గత 5-7 సంవత్సరాలలో అతని ప్రదర్శనలు, అతను ప్రతి సిరీస్‌లో తన సహకారాన్ని అందించాడు. అతనిలాంటి ఆటగాళ్లు దొరకడం అరుదు.

Next Story