చెన్నైలోని చెపాక్ వేదికగా మంగళవారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్ ఢిపెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ముంబై పై ఢిల్లీ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధాంచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై.. అమిత్ మిశ్రా (424) ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులకే పరిమితమైంది. అనంతరం శిఖర్ ధావన్ (45), స్టీవ్ స్మిత్ (33), లలిత్ యాదవ్(22 నాటౌట్) రాణించడంతో 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్మాన్ని చేధించింది ఢీల్లీ క్యాపిటల్స్.
అసలే ఈ మ్యాచ్ ఓడిపోయిన బాధతో ఉన్న ముంబై జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకు మరో షాక్ తగిలింది. ఈ మ్యాచ్‌లో ముంబై.. స్లో ఓవర్ రేట్ నమోదు చేసింది. ఈ సీజన్‌లో ముంబైకి ఇదే తొలిసారి కావడంతో జట్టు కెప్టెన్ అయిన రోహిత్ శర్మకు రూ.12లక్షల జరిమానా విధించినట్లు ఐపీఎల్ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా.. ఐపీఎల్ రూల్స్ ప్రకారం ఏ జట్టైనా.. 90 నిమిషాల్లో 20 ఓవర్ల కోటాను పూర్తి చేయాల్సి ఉంటుంది. తొలి సారి ఇలా చేస్తే రూ.12లక్షల జరిమానా విధిస్తారు. ఆ తరువాత రెండు మ్యాచ్‌లలోపు మరోసారి అదే తప్పిదం చేస్తే.. రెండు నుంచి నాలుగు మ్యాచ్‌ల నిషేదం విధిస్తారు. కాగా.. ముంబై తన తదుపురి మ్యాచ్‌లో కూడా ఇలాగే స్లో ఓవర్ రేటుకు పాల్పడితే.. రోహిత్ పై రెండు నుంచి నాలుగు మ్యాచ్‌ల నిషేదం పడనుంది.