ర్యాంకింగ్స్‌లో రోహిత్‌, అశ్విన్ దూకుడు.. కెరీర్ బెస్ట్ ర్యాంక్ సాధించిన హిట్‌మ్యాన్‌

Rohit Sharma climbs to career best 8th place in ICC Test rankings.టీమ్ఇండియా ప్ర‌స్తుతం ఇంగ్లాండ్‌తో నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడుతోంది.

By తోట‌ వంశీ కుమార్‌
Published on : 28 Feb 2021 3:20 PM IST

Rohit Sharma test ranking

టీమ్ఇండియా ప్ర‌స్తుతం ఇంగ్లాండ్‌తో నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడుతోంది. మూడు టెస్టులు ముగియ‌గా.. ప్ర‌స్తుతం భార‌త్ 2-1తో ఆధిక్యంలో ఉంది. ఇరు జ‌ట్ల మ‌ధ్య చివ‌రి టెస్టు మ్యాచ్ మార్చి 4 నుంచి ప్రారంభం కానుంది. ప్ర‌స్తుత సిరీస్‌లో భార‌త ఓపెన‌ర్ హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ‌తో పాటు బౌల‌ర్ అశ్విన్ లు మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న చేశారు. దీంతో నేడు ఐసీసీ(అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌) ప్ర‌క‌టించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో ఈ ఇద్ద‌రు దూసుకెళ్లారు. చెన్నైలో టెస్ట్‌లో శ‌త‌కంతో పాటు మూడో టెస్టు తొలి ఇన్సింగ్స్‌లో అర్థ‌శ‌త‌కంతో రోహిత్ అద‌ర‌గొట్టాడు.

దీంతో తొలి సారి బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్ స్థానంలో టాప్-10 స్థానంలో చోటు ద‌క్కించుకున్నారు. ఆరు స్థానాలు మెరుగుప‌రచుకొని 8వ ర్యాంకులో నిలిచాడు. అటు అశ్విన్ కూడా బౌల‌ర్ల ర్యాంకింగ్స్‌లో మూడ‌వ స్థానానికి ఎగ‌బాకాడు. ఇక ప‌రుగుల యంత్రం, టీమ్ఇండియా కెప్టెన్ ఐద‌వ స్థానంలో కొన‌సాగుతుండ‌గా.. కివీస్ కెప్టెన్ కేన్ విలియ‌మ్ నెంబ‌ర్ వ‌న్ స్థానంలో నిలిచాడు.


Next Story