చెన్నైటెస్ట్.. శతకంతో సత్తా చాటిన రోహిత్.. కోహ్లీ డకౌట్
Rohit sharma Century in Chennai Test.చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో రోహిత్ శర్మ
By తోట వంశీ కుమార్ Published on 13 Feb 2021 7:52 AM GMTచెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో రోహిత్ శర్మ దుమ్ములేపుతున్నాడు. శతకంతో సత్తా చాటాడు. ఓ వైపు బ్యాట్స్‌మెన్లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కడుతుండగా.. హిట్‌మ్యాన్ తనదైన శైలిలో పరుగులు రాబడూ 130 బంతుల్లో 14 పోర్లు, 2 సిక్స్ సాయంతో శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం భారత్ స్కోర్ 147/3. రోహిత్‌కు తోడుగా రహానే 26 పరుగులతో క్రీజులో ఉన్నాడు.
అంతకముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. పరుగుల ఖాతాను తెరవకముందే ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌ను రెండో ఓవర్ మూడో బంతికి ఒలీ స్టోన్ ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. ఈ దశలో ఇన్నింగ్స్‌ను నిర్మించే బాధ్యతను హిట్‌మ్యాన్ రోహిత్ శర్మతో పాటు నయా వాల్ పుజారా(21) భుజాన వేసుకున్నారు. తొలుత వీరిద్దరు వికెట్ కాపాడుకోవడానికే ప్రాధాన్యం ఇచ్చారు. ఇక క్రీజులో కుదురుకున్న అనంతరం హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ బౌండరీలతో విరుచుకుపడ్డాడు. కేవలం 48 బంతుల్లో అర్థశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. మరోవైపు పుజారా క్రీజులో అసహనంగా కనిపించాడు. బౌలర్లను ఎదుర్కొనేందుకు ఇబ్బందులు పడ్డాడు. జాక్ లీ బౌలింగ్‌లో స్లిప్‌లో స్టోక్స్ చేతికి చిక్కాడు. వీరిద్దరు రెండో వికెట్‌కు 85 పరుగులు జోడించారు.
ఈ దశలో ఆదుకుంటాడని భావించిన కెప్టెన్ కోహ్లీ మరుసటి ఓవర్‌లోనే డకౌట్‌గా వెనుదిరిగాడు. మోయిన్ అలీ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. దీంతో 86 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి టీమ్ఇండియా కష్టాల్లో పడింది. ఓ వైపు వికెట్లు పడుతున్నా రోహిత్ ధాటిగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. అతడికి అజింక్యా రహానే జత కలిశాడు. వీరిద్దరు నిలకడగా ఆడుతున్నారు. మోయిన్ అలీ బౌలింగ్‌లో రోహిత్ రెండు పరుగులు సాధించి టెస్టుల్లో 7వ శతకాన్ని నమోదు చేశాడు.