టీ20ల్లో హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ అరుదైన ఘ‌న‌త‌

Rohit Sharma becomes first Indian batter to smash 300 fours in T20Is.టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ టీ20ల్లో అరుదైన ఘ‌న‌త

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 July 2022 5:02 AM GMT
టీ20ల్లో హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ అరుదైన ఘ‌న‌త‌

టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ టీ20ల్లో అరుదైన ఘ‌న‌త సాధించాడు. బ‌ర్మింగ్‌హామ్‌ వేదిక‌గా శ‌నివారం ఇంగ్లాండ్‌తో జ‌రిగిన రెండో టీ20 మ్యాచ్‌లో రోహిత్ ఈ ఘ‌న‌త అందుకున్నాడు. పొట్టి ఫార్మాట్‌లో 300 ఫోర్లు కొట్టిన రెండో ఆట‌గాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. భార‌త్ త‌ర‌పున ఈ ఘ‌న‌త సాధించిన తొలి ఆటగాడు రోహిత్ శ‌ర్మ‌నే కావ‌డం విశేషం.

ఐర్లాండ్ ఆట‌గాడు పాల్ స్టిర్లింగ్ 104 టీ20ల్లో 325 పోర్ల‌తో టాప్‌లో కొన‌సాగుతుండ‌గా.. రోహిత్ శ‌ర్మ 126 మ్యాచుల్లో 301 పోర్ల‌తో రెండో స్థానంలో కొన‌సాగుతున్నాడు. భార‌త మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 298 పోర్ల‌తో మూడవ స్థానం ఉన్నాడు. ఇక సిక్సర్లలో గప్తిల్‌ (165) తొలి స్థానంలో ఉండగా రోహిత్‌(157) రెండో స్థానంలో ఉన్నాడు.

రెండో టీ20 మ్యాచ్‌కు ముందు రోహిత్‌, కోహ్లీ ఇద్ద‌రూ 298 పోర్ల‌తో స‌మానంగా ఉన్నారు. అయితే రోహిత్ శ‌ర్మ 20 బంతుల్లో 3పోర్లు, 2 సిక్స‌ర్లు బాది 31 ప‌రుగులు చేశ‌గా.. కోహ్లీ(1) తీవ్రంగా నిరాశ‌ప‌రిచాడు. దీంతో రోహిత్ 300 పోర్ల మైలురాయిని అందుకున్న తొలి ఆట‌గాడిగా నిలిచాడు.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన రోహిత్‌ సేన నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా ( 46 నాటౌట్‌; 29 బంతుల్లో 5 ఫోర్లు) విలువైన ఇన్నింగ్స్ ఆడ‌గా, ఓపెన‌ర్లు రోహిత్ శ‌ర్మ రోహిత్‌ శర్మ (31; 20బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు), రిషబ్‌ పంత్‌ (26; 15 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్‌) లు రాణించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్‌ జోర్డాన్‌ 4, అరంగేట్ర పేసర్‌ రిచర్డ్‌ గ్లీసన్‌ మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో ఇంగ్లాండ్‌ 17 ఓవర్లలో 121 పరుగులకే కుప్ప‌కూలింది. మోయిన్‌ అలీ (35; 21 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు), డేవిడ్‌ విల్లే (33 నాటౌట్‌; 22 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) మాత్ర‌మే ఓ మోస్తారుగా పోరాడారు. భారత బౌలర్లలో భువనేశ్వర్ మూడు, బుమ్రా, చాహల్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

Next Story
Share it