ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2024 సీజన్‌కు ముందు రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా నియమిస్తూ ముంబై ఇండియన్స్ తీసుకున్న నిర్ణయానికి లెజెండరీ ఇండియన్ క్రికెట్ టీమ్ బ్యాటర్ సునీల్ గవాస్కర్ సపోర్ట్ చేశారు. పాండ్యా గుజరాత్ టైటాన్స్ నుండి ట్రేడ్‌ను పూర్తి చేశాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ పదేళ్ల పదవీకాలాన్ని పూర్తీ చేశారు. కెప్టెన్‌గా పాండ్యా ఉండడం ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీకి ప్రయోజనం చేకూరుస్తుందని, ఫలితంగా రోహిత్‌కు ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడే స్వేచ్ఛ ఉంటుందని గవాస్కర్ అభిప్రాయపడ్డారు.
ప్రాంఛైజీ భవిష్యత్ గురించి ఆలోచించి ముంబయి ఇండియన్స్ ఈ నిర్ణయం తీసుకుందన్నారు గవాస్కర్. రోహిత్ శర్మకు ఇప్పుడు 36 ఏళ్లు.. అంతేగాక టీమిండియాకు మూడు ఫార్మాట్లలో కెప్టెన్ బాధ్యతలు నిర్వర్తిస్తూ తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నాడు. దీంతో రోహిత్‌కు కాస్త ఉపశమనం ఇవ్వడానికి యువ ప్లేయర్ అయిన హార్దిక్ పాండ్యకు కెప్టెన్ పగ్గాలు అందించారన్నారు. హార్దిక్ గుజరాత్ టైటాన్స్‌ను వరుసగా రెండు సార్లు ఫైనల్‌కు చేర్చాడనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఒక్కసారి టైటిల్ కూడా గెలిచాడు.. ఈ విషయాలన్నింటిని పరిగణనలోకి తీసుకునే ముంబయి ఇండియన్స్ జట్టు ఈ నిర్ణయం తీసుకుంది. హార్దిక్ పాండ్య కెప్టెన్సీ ముంబయి ఇండియన్స్‌కు ఎంతో లాభదాయకమన్నారు. రోహిత్‌కు ఇప్పుడు పూర్తి స్వేచ్ఛగా బరిలోకి దిగుతాడు. ఇకపై టాప్ ఆర్డర్‌లో రోహిత్ ఫ్రీగా తన శైలికి తగ్గట్లుగా బ్యాటింగ్ చేయొచ్చన్నారు.