టీ20ల్లో హిట్‌మ్యాన్ అరుదైన రికార్డు

Rohit becomes first Indian to hit 400 T20 sixes.ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్‌, భారత జ‌ట్టు ఓపెన‌ర్ హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Oct 2021 11:20 AM IST
టీ20ల్లో హిట్‌మ్యాన్ అరుదైన రికార్డు

ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్‌, భారత జ‌ట్టు ఓపెన‌ర్ హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ టీ20ల్లో అరుదైన ఘ‌న‌త సాధించాడు. పొట్టి ఫార్మాట్‌లో 400 సిక్స్‌లు కొట్టిన ఏకైక భార‌త ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్కాడు. మంగ‌ళ‌వారం రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ ఈ ఘ‌న‌త అందుకున్నాడు. రోహిత్ త‌రువాతి స్థానంలో సురేష్ రైనా(325), విరాట్ కోహ్లీ(320), ధోని(304) లు ఉన్నారు. భార‌త జ‌ట్టు త‌రుపున టీ20ల్లో 133 సిక్స‌ర్లు బాదిన రోహిత్‌.. ఐపీఎల్‌లో 227, ఛాంపియ‌న్స్ లీగ్ టీ20ల్లో 24 కొట్టాడు. ఇక మొత్తంగా చూసుకుంటే.. యూనివ‌ర్స‌ల్ బాస్ క్రిస్‌గేల్ 1042 సిక్స‌ర్ల‌తో ఎవ్వ‌రికి అంద‌నంత ఎత్తులో తొలి స్థానంలో ఉన్నాడు. ఆ త‌రువా పొలార్డ్‌(758), ర‌సెల్‌(510), మెక‌ల‌మ్‌(485) త‌రువాతి స్థానాల్లో ఉన్నారు.

ఇక తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఢిపిండింగ్‌ ఛాంపియన్స్‌ ముంబై ఇండియన్స్ స‌త్తా చాటింది. 8 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజ‌స్థాన్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 90 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. కౌల్టర్‌ నైల్‌ (4/14), జిమ్మీ నీషమ్‌ (3/12) ప్రత్యర్థిని గ‌ట్టి దెబ్బ‌కొట్టారు. అనంత‌రం స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని ముంబై 8.2 ఓవ‌ర్ల‌లో రెండు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి చేదించింది. రోహిత్ 22 ప‌రుగుల‌తో రాణించ‌గా.. ఇషాన్‌ కిషన్‌ (25 బంతుల్లో 50 నాటౌట్‌; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీతో చెలరేగాడు. ఈ విజ‌యంతో ముంబై ప్లే ఆశ‌లు స‌జీవంగా ఉండ‌గా.. రాజ‌స్థాన్ రేసు నుంచి నిష్క్రమించింది.

Next Story