CSK కారణంగానే భారత్ న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది : టీమిండియా మాజీ బ్యాట్స్‌మెన్
స్వదేశంలో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భారత్‌ను క్లీన్ స్వీప్ చేసి న్యూజిలాండ్ చరిత్ర సృష్టించింది.
By Medi Samrat Published on 7 Nov 2024 4:30 PM ISTస్వదేశంలో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భారత్‌ను క్లీన్ స్వీప్ చేసి న్యూజిలాండ్ చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకు భారత్‌కు ఇదే అతిపెద్ద ఓటమి కావడం విశేషం. ఈ ఓటమి తర్వాత భారత మాజీ బ్యాట్స్‌మెన్ రాబిన్ ఉతప్ప చెన్నై సూపర్ కింగ్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై ఫ్రాంచైజీ.. సిరీస్‌కు ముందు న్యూజిలాండ్‌కు చెందిన రచిన్ రవీంద్రను తమ అకాడమీలో ప్రాక్టీస్ చేయడానికి అనుమతించడమే దీనికి కారణం అన్నాడు.
గత ఏడాది ఐపీఎల్‌లో రచిన్ రవీంద్ర చెన్నై జట్టు తరుపున ఆడాడు. టీమ్ ఇండియాతో సిరీస్‌కు ముందు రచిన్ CSK అకాడమీలో ప్రాక్టీస్ చేశాడు. తద్వారా అతడు భారత్‌లోని పరిస్థితులను బాగా అర్థం చేసుకోగలిగాడు. దీని నుండి రచిన్ ప్రయోజనం పొందాడు. అతడు సిరీస్‌లో న్యూజిలాండ్ జట్టు తరుపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు. భారత జట్టును కూడా చాలా ఇబ్బంది పెట్టాడని పేర్కొన్నాడు. CSK చేసిన ఈ పని వల్ల ఉతప్ప చాలా నిరాశకు గురయ్యాడు.
అయితే ఉతప్ప స్వయంగా CSK తరపున ఆడాడు. 2021 సంవత్సరంలో టైటిల్ గెలుచుకున్న జట్టులో సభ్యుడు. ధోనీని ప్రత్యేకంగా భావిస్తా.. దేశం విషయానికి వస్తే కొన్ని హద్దులు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని అన్నాడు.
ఉతప్ప మాట్లాడుతూ.. "రచిన్ రవీంద్ర ఇక్కడికి వచ్చి CSK అకాడమీలో ప్రాక్టీస్ చేసాడు. CSK తన ఆటగాళ్లను చూసుకునే గొప్ప ఫ్రాంచైజీ, కానీ దేశ ప్రయోజనాల విషయానికి వస్తే, పరిమితులు గీయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా విదేశీ ఆటగాడి విషయానికి వస్తే అతడు మీ దేశానికి వ్యతిరేకంగా ఆడుతాడు.. అది గుర్తుంచుకోవాలన్నాడు.
ఈ సిరీస్‌లో రచిన్ మూడు మ్యాచ్‌ల్లో మొత్తం 256 పరుగులు చేశాడు. సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. తొలిసారిగా న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌లో భారత్‌ను ఓడించింది. స్వదేశంలో మూడు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత్ క్లీన్‌స్వీప్ అవడం ఇదే తొలిసారి.