ఐపీఎల్ వేలంలో రూ. 3.6 కోట్లు ప‌లికిన క్రికెట‌ర్‌కు రోడ్డు ప్రమాదం

ఐపీఎల్ 2024 వేలంలో రూ. 3.6 కోట్లు పొందిన దేశ వర్ధమాన క్రికెటర్,గుజరాత్ టైటాన్స్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రాబిన్ మింజ్ శనివారం రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు

By Medi Samrat  Published on  3 March 2024 9:49 AM GMT
ఐపీఎల్ వేలంలో రూ. 3.6 కోట్లు ప‌లికిన క్రికెట‌ర్‌కు రోడ్డు ప్రమాదం

ఐపీఎల్ 2024 వేలంలో రూ. 3.6 కోట్లు పొందిన దేశ వర్ధమాన క్రికెటర్,గుజరాత్ టైటాన్స్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రాబిన్ మింజ్ శనివారం రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. జార్ఖండ్ నుంచి వస్తున్న ఈ యువ ఆటగాడు ప్రస్తుతం వైద్యుల‌ పరిశీలనలో ఉన్నాడు. 21 ఏళ్ల రాబిన్ తన కవాసకీ సూపర్‌బైక్‌పై వెళ్తుండగా మరో బైక్‌ను ఢీ కొనడంతో అదుపు తప్పి ప‌డిపోయాడు. రాబిన్ తండ్రి ఫ్రాన్సిస్ మింజ్ ప్ర‌మాద‌ వార్తలను ధృవీకరించారు.

రాంచీ ఎయిర్‌పోర్ట్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న రాబిన్ తండ్రి ఫ్రాన్సిస్ తెలిపిన వివరాల ప్రకారం.. రాబిన్ బైక్ అదుపు తప్పి మరో బైక్‌ను ఢీకొట్టింది. అదృష్టవశాత్తూ, గాయాలు తీవ్రంగా లేవు. వైద్యులు రాబిన్‌ను నిశితంగా పరిశీలిస్తున్నారు. ప్రమాదంలో రాబిన్ సూపర్ బైక్ ముందు భాగం బాగా దెబ్బతింది. అతని కుడి మోకాలికి కొన్ని గాయాలయ్యాయి. ఇటీవల కర్ణాటకతో జరిగిన CK నాయుడు ట్రోఫీ క్వార్టర్-ఫైనల్‌లో జార్ఖండ్‌కు ప్రాతినిధ్యం వహించిన తర్వాత రాబిన్ స్వరాష్ట్రానికి తిరిగి వచ్చాడు. నాకౌట్ పోరులో రాబిన్ మింజ్ 137 పరుగులు చేశాడు.

రాబిన్ ప్రీ-సీజన్ క్యాంప్ కోసం గుజరాత్ టైటాన్స్ జ‌ట్టులో చేరాల్సి ఉంది. అయితే ప్ర‌మాదం కార‌ణంగా అతడు పాల్గొనడం ఆలస్యం అవుతుందా లేదా అనేది ప్రస్తుతానికి అస్పష్టంగా ఉంది. గతేడాది మినీ వేలంలో రాబిన్ మింజ్ ను గుజరాత్ టైటాన్స్ రూ.3.6 కోట్లకు కొనుగోలు చేసింది.

Next Story