టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ.. పంత్ బ్యాటింగ్‌కు రావ‌డం క‌ష్ట‌మే..!

మాంచెస్టర్ టెస్టులో భారత జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ మొదటి రోజు గాయంతో రిటైర్ అయ్యాడు.

By Medi Samrat
Published on : 24 July 2025 2:41 PM IST

టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ.. పంత్ బ్యాటింగ్‌కు రావ‌డం క‌ష్ట‌మే..!

మాంచెస్టర్ టెస్టులో భారత జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ మొదటి రోజు గాయంతో రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. అతని కాలి బొటనవేలులో ఫ్రాక్చర్ ఉంది. దీంతో ఆరు వారాల విశ్రాంతి సూచించబడింది. భారత ఇన్నింగ్స్‌లో 68వ ఓవర్‌లో క్రిస్ వోక్స్ వేసిన బంతికి పంత్ రివర్స్ స్వీప్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. బ్యాట్ లోపలి భాగాన్ని తాకిన‌ బంతి అతని కుడి పాదం బొటనవేలికి తగిలింది. దీంతో పంత్ మైదానం వీడాడు.

భారత జట్టు ప్లేయింగ్ 11లో ఇప‌ప్పుడు ఒక ఆటగాడు తగ్గాడు. అవసరమైతే రిషబ్ పంత్ నొప్పి నివారణ మాత్రలు వేసుకుని బ్యాటింగ్ చేయొచ్చా లేదా అనేది భారత జట్టు మేనేజ్‌మెంట్ వైద్య బృందం స‌ల‌హా కోరింది.

స్కాన్ రిపోర్టులో ఫ్రాక్చర్ అయినట్లు తేలిందని, పంత్ ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల‌ని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. పెయిన్ కిల్లర్స్ తీసుకున్న పంత్‌ మళ్లీ బ్యాటింగ్ కు వస్తాడా లేదా అనేది వైద్య బృందం క్లారిటీ ఇవ్వాల్సివుంది. పంత్‌ నడవడానికి మద్దతు అవసరం.. అతడు బ్యాటింగ్ చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయనేది తెలుస్తుంది.

కాగా, రిషబ్ పంత్‌కు ప్రత్యామ్నాయంగా ఐదో టెస్టుకు ముందు ఇషాన్ కిషన్‌ను జట్టులోకి తీసుకోవాలని సెలక్షన్ కమిటీ నిర్ణయించింది. 2025 జూలై 31 నుంచి ఆగస్టు 4 వరకు ఓవల్‌లో భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదో టెస్టు జరగనుంది.

ప్రస్తుత సిరీస్‌లో ఆటగాళ్ల గాయాల‌తో భారత జట్టు సతమతమవుతోంది. ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి మోకాలి గాయం కారణంగా సిరీస్ కు దూరమయ్యాడు. అర్ష్‌దీప్ సింగ్ బొటన వేలికి గాయం కావడంతో, అతను నాల్గవ టెస్ట్‌కు దూరంగా ఉన్నాడు. ఆకాష్‌దీప్ గజ్జ సమస్యతో బాధపడుతున్నాడు.

మాంచెస్టర్‌లో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు 83 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 264 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా (19*), శార్దూల్ ఠాకూర్ (19*) పరుగులతో క్రీజులో ఉన్నారు.

Next Story