రిషబ్‌ పంత్ రీఎంట్రీ కన్ఫర్మ్.. బీసీసీఐ కీలక ప్రకటన

ఎట్టకేలకు ఐపీఎల్ 2024 సీజన్‌ ద్వారా రిషబ్‌ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

By Srikanth Gundamalla  Published on  12 March 2024 1:29 PM IST
rishabh pant, re-entry, ipl-2024, cricket, bcci,

 రిషబ్‌ పంత్ రీఎంట్రీ కన్ఫర్మ్.. బీసీసీఐ కీలక ప్రకటన

రోడ్డు ప్రమాదంలో టీమిండియా స్టార్‌ క్రికెటర్ రిషబ్‌ పంత్‌ తీవ్ర గాయాలపాలైన విషయం తెలిసిందే. 2022 డిసెంబర్‌ 30వ తేదీన రోడ్డుప్రమాదంలో గాయపడి.. చికిత్స పొందారు. ప్రమాదం తర్వాత ఒంటి నిండ గాయాలు కావడంతో ఇన్నాళ్లూ క్రికెట్‌కు దూరంగానే ఉన్నాడు. అయితే.. రిషబ్‌ పంత్‌ ప్రస్తుతం కోలుకున్నాడనీ.. త్వరలోనే జరగబోయే ఐపీఎల్ సీజన్‌లో ఆడనున్నాడిన ప్రచారం జరిగింది. తాజాగా ఇదే విషయంపై బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది.

ఐపీఎల్ 2023 సీజన్‌కు రిషబ్‌ పంత్ దూరంగానే ఉన్నాడు. అదే ఏడాది భారత్‌ వేదికగా జరిగిన వన్డే వరల్డ్‌ కప్‌2023 టోర్నీకి కూడా అందుబాటులోకి రాలేకపోయాడు. కానీ.. మ్యాచ్‌లకు హాజరు అవుతూ ఉత్సాహాన్ని నింపాడు. ఫైనల్‌లో భారత్‌ ఓడిపోయిన విషయం తెలిసిందే. అప్పుడు రిషబ్‌ పంత్‌ టీమ్‌లో ఉండి ఉంటే బాగుండేదనే అభిప్రాయాలు అభిమానుల నుంచి వచ్చాయి. ప్రస్తుతం గాయాల నుంచి పూర్తిగా కోలుకుని.. ఫిట్నెస్‌ సాధించాడని తెలుస్తోంది. ఎట్టకేలకు ఐపీఎల్ 2024 సీజన్‌ ద్వారా రిషబ్‌ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. 14 నెలల రీహబ్ తర్వాత రిషబ్‌ పంత్‌ ఐపీఎల్ ఆడేందుకు సిద్ధం అయ్యాడు.

రిషబ్‌ పంత్ కోలుకున్నాడనీ టాటా ఐపీఎల్ సీజన్‌-2024లో ఆడేందుకు సిద్ధం అయ్యాడని బీసీసీఐ తెలిపింది. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా ఒక పోస్టు పెట్టింది. 14 నెలల రీహబ్‌ తర్వాత పంత్‌ కోలుకున్నట్లు తెలిపింది. ప్రస్తుతం అతని ఫిట్‌నెస్‌ బాగుందని వివరించింది. వికెట్‌ కీపర్‌గా ఆడేందుకు ఫిట్‌గా ఉన్నట్లు తెలిపింది బీసీసీఐ. ఐపీఎల్-2024లో ఆడేందుకు రిషబ్‌ పంత్‌ సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. దాంతో.. రిషబ్‌ పంత్‌ రీఎంట్రీ కన్ఫర్మ్ అయిపోయింది. ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌గా రిషబ్‌ పంత్‌ ఆడబోతున్నాడు.

ఇక రిషబ్‌ ఐపీఎల్‌2024 ఈజన్‌లో బాగా రాణిస్తే జూన్‌లో జరగబోయే టీ20 వరల్డ్‌ కప్‌ టోర్నీకి కూడా ఎంపిక అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రిషబ్‌ పంత్ మునుపటి ఫామ్‌ను కొనసాగిస్తే అతను తిరిగి టీమిండియాలోకి రావడానికి ఎక్కువ సమయం కూడా అవసరం లేదని అంటున్నారు క్రీడా నిపుణులు.


Next Story