దక్షిణాఫ్రికాతో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం బీసీసీఐ ప్రకటించిన 15 మంది ఆటగాళ్ల లిస్టులో రిషబ్ పంత్ చోటు దక్కించుకున్నాడు. ఈ సిరీస్ లో శుభ్‌మాన్ గిల్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. 28 ఏళ్ల పంత్ ఇటీవల ఇండియా-ఎ vs దక్షిణాఫ్రికా-ఎ మ్యాచ్‌లో అద్భుతమైన ఫామ్‌ను ప్రదర్శించాడు. జట్టుకు కెప్టెన్‌గా నడిపించాడు.
ఇంగ్లండ్ పర్యటనలో మాంచెస్టర్ టెస్ట్ సందర్భంగా క్రిస్ వోక్స్ వేసిన బంతి పంత్ పాదానికి తగిలి గాయపడ్డాడు. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో అతను కోలుకున్నాడు. పంత్ శుభ్‌మన్ గిల్ డిప్యూటీగా తిరిగి జట్టులోకి వచ్చాడు. వెస్టిండీస్ సిరీస్‌లో మంచి ప్రదర్శన ఇచ్చిన ధ్రువ్ జురెల్ రెండవ వికెట్ కీపర్‌గా ఉంటాడు. ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో అక్షర్ పటేల్ కూడా టెస్ట్ జట్టులోకి తిరిగి వచ్చాడు. అక్షర్ చివరిసారిగా 2024లో టెస్ట్ ఆడాడు. వెస్టిండీస్ సిరీస్‌కు దూరమైన తర్వాత ఆకాష్ దీప్ కూడా టెస్ట్ జట్టులోకి తిరిగి వచ్చాడు.
భారత జట్టు:
శుభమన్ గిల్ (సి), రిషబ్ పంత్ (డబ్ల్యుకె) (విసి), యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, మహ్మద్ దేప్ సిరాజ్, కుల్‌దీప్ యాద్ సిరాజ్