టీమిండియాకు కొత్త ఫినిషర్.. అదరగొడుతున్న రింకూ సింగ్
విధ్వంసకర బ్యాటర్‌గా రింకూ సింగ్ పేరు తెచ్చుకున్నాడు. బెస్ట్ ఫినిషర్‌గాను పేరు సంపాదించుకుంటున్నాడు.
By Srikanth Gundamalla Published on 27 Nov 2023 7:25 AM ISTటీమిండియాకు కొత్త ఫినిషర్.. అదరగొడుతున్న రింకూ సింగ్
గత ఐపీఎల్ సీజన్‌లో కోల్‌కతా బ్యాటర్ రింకూ సింగ్ పేరు మార్మోగిన విషయం తెలిసిందే. విధ్వంసకర బ్యాటర్‌గా రింకూ సింగ్ పేరు తెచ్చుకున్నాడు. ఐపీఎల్‌లో ఐదు బంతుకు అయిదు సిక్స్‌లు బాది.. అందరి చూపును తనవైపు తిప్పుకున్నాడు రింకూ సింగ్. ఇక అప్పటి నుంచి రింకూ సింగ్ తనదైన శైలిలో రాణిస్తూనే ఉన్నాడు. బెస్ట్ ఫినిషర్‌గాను పేరు సంపాదించుకుంటున్నాడు. తాజాగా ఆస్ట్రేలియాతో టీమిండియా మూడు టీ20ల సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. భారత్ వేదికగానే ఈ సిరీస్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు జరిగిన రెండు మ్యాచుల్లో టీమిండియా గెలిచి.. లీడ్‌లో కొనసాగుతోంది.
ఆదివారం తిరువనంతపురంలో గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన రెండో టీ20లో భారత యువ ఆటగాళ్లు రెచ్చిపోయారు. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 235 పరుగులు చేశారు. తొలుత టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాకు బిగ్‌షాక్ ఇచ్చారు. యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ ముగ్గూరు అర్థ సెంచరీలతో రాణించారు. ఇక ఐదో బ్యాటర్‌గా వచ్చిన రింకూ సింగ్ మాత్రం మెరుపు షాట్లతో రఫ్ఫాడించాడు. కేవలం 9 బాల్స్‌లో 31 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దాంతో.. రింకూ సింగ్ రన్‌రేట్ 344.4 గా ఉంది. తొలి టీ20 మ్యాచ్‌లో కూడా రింకూ సింగే చివరి సిక్సర్‌తో మ్యాచ్‌ను గెలిపించాడు. ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో రింకూ సింగ్ కూల్‌గా కనిపించాడు. ఒక బంతిలో ఒక పరుగు తీయాల్సి ఉండగా.. సిక్సర్‌గా మలిచి టీమిండియాకు తొలి విజయాన్ని అందించాడు రింకూ. తొలి మ్యాచ్‌లో 14 బంతుల్లో 22 పరుగుల చేశాడు. దాంతో.. రింకూ సింగ్ బెస్ట్ ఫినిషర్ అని అందరూ చెబుతున్నారు.
మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత టీమిండియాను ఫినిషర్ పాత్ర వేధిస్తూనే ఉంది. టీమిండియా అలాంటి ఆటగాడి కోసం ఎన్నో ప్రయోగాలు చేసింది. కానీ.. కొన్ని సార్లు ఫలితాలు తారుమారు కావడంతో చేతులు కాల్చుకునే పరిస్థితులు. తాజాగా టీమిండియాకు బెస్ట్ ఫినిషనర్ దొరికాడని అందరూ చర్చించుకుంటున్నారు. చివర్లో వస్తూ ఏమాత్రం టెన్షన్ లేకుండా బౌండరీలను సాధిస్తున్న రింకూ సింగ్ బెస్ట్ ఫినిషర్‌గా మారే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. అటు భారత మాజీ ఆటగాళ్లు.. ప్రస్తుతం ఉన్న ప్లేయర్స్ రింకూ ఆటను అభినందిస్తున్నారు. వచ్చే వరల్డ్ కప్‌లో రింకూ సింగ్ కీలక ఆటగాడిగా మారే అవకాశాలు ఉన్నాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.