గతం మర్చిపోలేదు..నాన్న ఇంకా సిలిండర్లు మోస్తున్నారు: రింకు సింగ్

తన గతాన్ని ఎప్పటికీ మర్చిపోనని క్రికెటర్ రింకు సింగ్ అన్నాడు. తన తండ్రి కూడా ఇంకా సిలిండర్లను మోస్తూనే ఉన్నాడని చెప్పాడు.

By Srikanth Gundamalla  Published on  3 Aug 2023 7:14 PM IST
Rinku singh, Comments Father, Cricket, India,

 గతం మర్చిపోలేదు..నాన్న ఇంకా సిలిండర్లు మోస్తున్నారు: రింకు సింగ్

గత ఐపీఎల్‌ సీజన్‌లో అదరగొట్టి అందరి చూపు తన వైపు తిప్పుకున్నాడు రింకు సింగ్. కోల్‌కతా నైట్‌ రైడర్స్ తరఫున అద్భుత ప్రదర్శనను ఇచ్చాడు. అయితే.. అతడి ప్రతిభను గుర్తించి జాతీయ జట్టు నుంచి కూడా పిలుపు వచ్చింది. ఈ క్రమంలో రింకు సింగ్ ఐర్లాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌లో ఆడనున్నాడు. అంతేకాదు.. ఆసియా గేమ్స్‌ కోసం పంపించే జట్టులోనూ స్థానం దక్కించుకున్నాడు రింకు సింగ్. ఈ క్రమంలో రింకు సింగ్‌ తాజాగా స్పందించాడు. తన గతాన్ని ఎప్పటికీ మర్చిపోనని అన్నాడు. అలాగే తన తండ్రి కూడా ఇంకా సిలిండర్లను మోస్తూనే ఉన్నాడని.. విశ్రాంతి తీసుకోవడం లేదని పేర్కొన్నాడు. నాన్నకు ఎంత చెప్పినా వినకుండా తన పని చేస్తూనే ఉన్నాడని రింకు సింగ్ తెలిపాడు.

క్రికెటర్‌గా పరుగులు సాధించడం తన బాధ్యత అన్నాడు రింకు సింగ్. అవకాశం వచ్చినప్పుడు తన వంతుగా వందశాతం ప్రయత్నం చేస్తానని అన్నాడు. తానెప్పుడూ ఊహల్లో బతకనని, వర్తమానంలో జీవించడమే తనకు ఇష్టమని చెప్పాడు రింకూ. శ్రమించడం మన చేతుల్లో ఉంటుందని.. ఫలితం గురించి ఆలోచించొద్దని అన్నాడు. శ్రమించిన తర్వాత ఏం జరుగుతుందనేది చూడాలని వ్యాఖ్యానించాడు. అయితే.. తాను టీమిండియాలోకి రావడం సంతోషంగా ఉందన్నాడు. తన కుటుంబం, చిన్ననాటి కోచ్‌, స్నేహితులు ఇలా ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉన్నారని తెలిపాడు. తాను టీమిండియాలోకి రావడంతో కలగా చెప్పుకొచ్చాడు. అభిషేక్ నాయర్‌, నితీశ్‌ సహకారంతో తాను ఇక్కడి వరకు వచ్చానని గుర్తు చేశాడు రింకు సింగ్.

తాను ఐపీఎల్‌లో రాణించి గుర్తింపు పొంది.. జాతీయ జట్టులోకి వచ్చినా.. తండ్రి మాత్రం తన విధులను వదలడం లేదని రింకూ చెప్పాడు. విశ్రాంతి తీసుకోండని చెప్పిన వినిపంచుకోవడం లేదన్నాడు. ఇప్పటికీ సిలిండర్లను మోస్తూనే ఉన్నారని చెప్పాడు. తన పని తాను చేసుకోవడం నాన్నకు ఇష్టమని ఈ సందర్భంగా చెప్పాడు రింకు సింగ్. నాన్నను అర్థం చేసుకుని నేనే అడగడం మానేశానని తెలిపాడు. ఇంట్లో ఉండటం బోర్‌గా ఫీలవుతారని.. తనకు తానుగానే ఆగాలని చెప్పుకొచ్చాడు రింకు సింగ్.

Next Story