నో టెన్షన్.. సెమీఫైనల్స్, ఫైనల్ కు రిజర్వ్ డే

ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో భాగంగా నవంబర్ 15, 16 తేదీల్లో సెమీఫైనల్ మ్యాచ్ లు నిర్వహించనున్నారు.

By Medi Samrat  Published on  14 Nov 2023 7:15 PM IST
నో టెన్షన్.. సెమీఫైనల్స్, ఫైనల్ కు రిజర్వ్ డే

ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో భాగంగా నవంబర్ 15, 16 తేదీల్లో సెమీఫైనల్ మ్యాచ్ లు నిర్వహించనున్నారు. నవంబర్ 19న ఫైనల్ జరగనుంది. సెమీస్ మ్యాచ్ లు, ఫైనల్ మ్యాచ్ లకు ఐసీసీ రిజర్వ్ డే ను కేటాయించింది. ఒకవేళ వర్షం వల్ల మ్యాచ్ జరగకపోతే రిజర్వ్ డేలో నిర్వహిస్తారు. మొదటి సెమీ ఫైనల్ లో భాగంగా టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ కు ఎలాంటి వర్ష సూచన లేదు. ఈ మ్యాచ్ ముంబయిలోని వాంఖెడే స్టేడియంలో జరగనుండగా వర్షం పడేందుకు కేవలం 3 శాతం అవకాశాలు మాత్రమే ఉన్నాయి.

నవంబర్ 16న కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. వర్షం పడే అవకాశాలు పగటి పూట 54 శాతం, రాత్రి వేళ 75 శాతం ఉన్నాయి. ఆదివారం నాడు జరిగే ఫైనల్ మ్యాచ్ కు వర్షం ముప్పు లేదని వాతావరణ సంస్థలు చెబుతున్నాయి. వర్షం వల్ల రిజర్వ్ డేలో కూడా మ్యాచ్ జరిపేందుకు వీలు కాకపోతే పాయింట్ల పట్టికలో స్థానాల ఆధారంగా తొలి సెమీస్ నుంచి టీమిండియా, రెండో సెమీస్ నుంచి దక్షిణాఫ్రికా ఫైనల్ చేరతాయి. ఫైనల్ మ్యాచ్ రిజర్వ్ డేతో సహా మ్యాచ్ జరగకపోతే భారత్ ను ప్రపంచ కప్ విజేతగా ప్రకటిస్తారు.

Next Story