డబ్ల్యూపీఎల్ టోర్నీ చరిత్రలో రెండోసారి ఫైనల్‌కు ఆర్సీబీ
డబ్ల్యూపీఎల్‌లో భాగంగా యూపీ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ఘన విజయం సాధించింది.
By - Knakam Karthik |
డబ్ల్యూపీఎల్ టోర్నీ చరిత్రలో రెండోసారి ఫైనల్‌కు ఆర్సీబీ
డబ్ల్యూపీఎల్‌లో భాగంగా యూపీ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ఘన విజయం సాధించింది. 144 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 13.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది. వరుసగా రెండు ఓటముల తర్వాత ప్లేఆఫ్స్ సమీకరణాలు సంక్లిష్టంగా మారే ప్రమాదాన్ని ఎదుర్కొన్న స్మృతి మంధాన సేన, కీలకమైన మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసింది. వడోదరలోని బీసీఏ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో యూపీ వారియర్స్ పై 8 వికెట్ల తేడాతో ఏకపక్ష విజయం సాధించి, టోర్నీ చరిత్రలో రెండోసారి ఫైనల్ చేరింది. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన ఆర్సీబీ, యూపీకి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధాన ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన యూపీ వారియర్జ్‌కు ఓపెనర్లు కెప్టెన్ మెగ్ లానింగ్ (30 బంతుల్లో 41), దీప్తి శర్మ మంచి శుభారంభం అందించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 74 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని నడిన్ డి క్లర్క్ విడదీసింది. లానింగ్ ఔటైన తర్వాత యూపీ ఇన్నింగ్స్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఒకవైపు దీప్తి శర్మ (43 బంతుల్లో 55) ఒంటరి పోరాటంతో అర్ధశతకం పూర్తి చేసినా, మరో ఎండ్‌లో సహకారం కరువైంది. అమీ జోన్స్ (1), హర్లీన్ డియోల్ (14), క్లో ట్రయాన్ (6) వంటి కీలక బ్యాటర్లు విఫలమవడంతో యూపీ వేగంగా వికెట్లు కోల్పోయింది. 12 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న ఆర్సీబీకి ఈ విజయంతో ఫైనల్‌కు వెళ్లేందుకు మార్గం సుగమమైంది.