ధోనీ చెప్పడంతోనే అలా ఆడా.. జ‌డేజా

Ravindra Jadeja.. చివ‌రి వ‌న్డేలో గెలిచి.. క్లీన్‌స్వీప్ కాకుండా ప‌రువు కాపాడుకుంది టీమ్ఇండియా. ఆసీస్‌తో బుధవారం

By సుభాష్  Published on  3 Dec 2020 9:08 AM GMT
ధోనీ చెప్పడంతోనే అలా ఆడా.. జ‌డేజా

చివ‌రి వ‌న్డేలో గెలిచి.. క్లీన్‌స్వీప్ కాకుండా ప‌రువు కాపాడుకుంది టీమ్ఇండియా. ఆసీస్‌తో బుధవారం జరిగిన ఆఖరి వన్డేలో భారత్ 13 పరుగులతో గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా (50 బంతుల్లో 66 నాటౌట్‌; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ధోని చెప్పిన చిట్కాతోనే మూడో వ‌న్డేలో చెల‌రేగాన‌ని అంటున్నాడు ఆల్‌రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా.

మ్యాచ్‌లో త‌న ఇన్నింగ్స్‌పై మాట్లాడిన జడేజా.. త‌న బ్యాటింగ్ మెరుగు ప‌డటానికి ధోనినే కార‌ణ‌మ‌న్నాడు. ధోని భాయ్‌తో కలిసి అటు టీమిండియాకు చాలా కాలం ఆడాను. అలాగే సీఎస్‌కే తరఫున కూడా ఆడుతున్నా. ధోని ఎప్పుడూ భాగస్వామ్యాలు నమోదు చేయడంపైనే ఎక్కువ ఫోకస్‌ చేస్తాడు. ఒక్కసారి బ్యాట్స్‌మన్‌ క్రీజ్‌లో సెట్‌ అయిన తర్వాత భారీ షాట్లు ఆడటానికి వీలుంటుందని ధోనినే చెబుతూ ఉండేవాడు. అదే విషయాన్ని నాకు చెప్పేవాడు. అదే పరిస్థితి ఆసీస్‌తో చివరి వన్డేలో ఎదురైంది. హార్దిక్‌తో కలిసి మంచి భాగస్వామ్యాన్ని సాధించినందుకు సంతోషంగా ఉంది. ఆఖరి ఐదు ఓవర్లలో చాన్స్‌ తీసుకుందామని హార్దిక్‌-నేను అనుకున్నాం. అదే అమలు చేసి అప్పటివరకూ స్ట్రైక్‌ రొటేట్‌.. ఆ త‌రువాత చెల‌రేగి ఆడాం అని జ‌డేజా చెప్పుకొచ్చాడు.

తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా 152 పరుగులకే ఐదు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో ప‌డింది. ఈ ద‌శ‌లో జట్టును హార్దిక్ పాండ్యా(76 బంతుల్లో 92 నాటౌట్‌; 7 ఫోర్లు, 1 సిక్స్‌), జడేజా ఆదుకున్నారు. విధ్వసంకర బ్యాటింగ్‌తో ఆరో వికెట్‌కు అజేయంగా 150 పరుగులు జోడించడంతో.. నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో టీమ్ఇండియా ఐదు వికెట్ల న‌ష్టానికి 302 ప‌రుగులు చేసింది. తర్వాత ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 289 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్‌ ఫించ్‌ (82 బంతుల్లో 75; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), మ్యాక్స్‌వెల్‌ (38 బంతుల్లో 59; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించినా..13 పరుగుల తేడాతో ఓట‌మి పాలైంది.

Next Story
Share it