అద‌ర‌గొట్టిన జ‌డేజా.. ఐసీసీ టెస్టు ఆల్‌రౌండ‌ర్ల జాబితాలో అగ్ర‌స్థానం

Ravindra Jadeja becomes world No 1 all-rounder in ICC Test rankings.అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తాజాగా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 March 2022 2:01 PM GMT
అద‌ర‌గొట్టిన జ‌డేజా.. ఐసీసీ టెస్టు ఆల్‌రౌండ‌ర్ల జాబితాలో అగ్ర‌స్థానం

అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తాజాగా ప్ర‌క‌టించిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమ్ఇండియా స్టార్ ఆల్‌రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా దుమ్ములేపాడు. రెండు స్థానాలు మెరుగుప‌ర‌చుకుని ఆల్‌రౌండ‌ర్ జాబితాలో అగ్ర‌స్థానాన్ని ద‌క్కించుకున్నాడు. ఇంత‌క ముందు 2017 ఆగ‌స్టులో కూడా ఓ వారం పాటు జ‌డేజా నెంబ‌ర్ వ‌న్ స్థానంలో కొన‌సాగాడు. ప్ర‌స్తుతం జ‌డ్డూ 406 రేటింగ్ పాయింట్ల‌తో తొలి స్థానంలో ఉండ‌గా.. రెండో స్థానంలో ఉన్న హోల్డ‌ర్ ఖాతాలో 382 పాయింట్లు ఉన్నాయి. భార‌త్ కు చెందిన ర‌విచంద్ర‌న్ అశ్విన్ ఒక స్థానం కోల్పోయి 347 పాయింట్ల‌తో మూడో స్థానంలో కొన‌సాగుతుండ‌గా.. బంగ్లాదేశ్ క్రికెట‌ర్ షకీబ్‌ అల్‌ హసన్‌, ఇంగ్లాండ్ ఆట‌గ‌డు బెన్‌ స్టోక్స్‌, ఆస్ట్రేలియాకు మిచెల్‌ స్టార్క్‌, కివీస్‌ ప్లేయర్లు కైలీ జెమీషన్‌, కొలిన్‌ డీ గ్రాండ్‌హోం ఆ త‌రువాతి స్థానాల్లో ఉన్నారు.

ఇటీవ‌ల శ్రీ‌లంక‌తో ముగిసిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో జ‌డేజా విశ్వరూపం చూపించాడు. తొలుత బ్యాటింగ్ లో 175 ప‌రుగుల అజేయ శ‌త‌కంతో స‌త్తా చాట‌గా.. ఆత‌రువాత రెండు ఇన్నింగ్స్‌ల్లో క‌లిపి 9 వికెట్లు ప‌డ‌గొట్టాడు. దీంతో టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో 17 స్థానాలు మెరుగుప‌ర‌చుకుని 54 ర్యాంకు నుంచి 34కు చేరుకున్నాడు. బౌలింగ్‌ విభాగంలో 17వ ర్యాంకులో కొన‌సాగుతున్నాడు. ఇక బ్యాటింగ్ విభాగంలో విరాట్ కోహ్లీ(5), రోహిత్ శ‌ర్మ‌(6), రిష‌బ్‌పంత్ (10) స్థానాలు ద‌క్కించుకోగా.. బౌలింగ్‌లో అశ్విన్‌(2), బుమ్రా(10) స్థానాల్లో నిలిచారు.

Next Story
Share it