పాకిస్థాన్-భారత్ మ్యాచ్‌లపై జడేజా ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ఇండియా–పాక్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌పై టీమిండియా స్టార్‌‌‌‌‌‌‌‌ క్రికెటర్‌‌‌‌‌‌‌‌ రవీంద్ర జడేజా తన అభిప్రాయాలు పంచుకున్నాడు.

By Srikanth Gundamalla  Published on  13 Aug 2023 4:57 PM IST
Ravindra Jadeja,  IND Vs Pak, Cricket,

పాకిస్థాన్-భారత్ మ్యాచ్‌లపై జడేజా ఇంట్రెస్టింగ్ కామెంట్స్

భారత్‌-పాకిస్థాన్‌ క్రికెట్‌ మ్యాచ్‌ అంటే ఈ రెండు దేశాలే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఈ మ్యాచ్‌లకు ఎంతో క్రేజ్‌ ఉంటుంది. అయితే.. వచ్చే నెలలో జరిగే ఆసియా కప్, అక్టోబర్-నవంబర్‌లో ఇండియాలో జరిగే వన్డే వరల్డ్‌ కప్స్‌లో ఇరు జట్లూ పోటీ పడుతున్నాయి. ఆసియాకప్‌కు ఇంకా నెల రోజుల సమయం ఉన్నా.. ఇప్పటి నుంచి భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌పై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఇండియా–పాక్‌‌‌‌‌‌‌‌ పోటీ గురించి టీమిండియా స్టార్‌‌‌‌‌‌‌‌ క్రికెటర్‌‌‌‌‌‌‌‌ రవీంద్ర జడేజా తన అభిప్రాయాలు పంచుకున్నాడు.

ఏ టోర్నీలో అయినా పాక్‌‌‌‌‌‌‌‌తో మ్యాచ్‌‌‌‌‌‌‌‌ అనగానే భారీగా అంచనాలు ఉంటాయని జడేజా అన్నాడు. పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో రాణించాలని ప్రతి ఆటగాడు భావిస్తాడని చెప్పుకొచ్చాడు. ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ ఉందంటే మన జట్టు గెలవాలని చాలా అంచనాలు ఉంటాయని.. కానీ మా వరకు జట్టు ఆడే ఏ మ్యాచ్‌ అయినా ఇండో-పాక్ మ్యాచ్‌కు సమానమైన ప్రాముఖ్యతే ఉంటుందని చెప్పాడు జడేజా. అయితే.. దాయాది దేశంతో ఉండే మ్యాచ్‌మ మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తుందని తెలిపాడు. కాబట్టే తాము కూడా మంచి ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తామని రవీంద్ర జడేజా తెలిపాడు.

ఆసియా కప్‌లో పాక్‌ చేతిలో టీమిండియా ఓటమి గురించి కూడా రవీంద్ర జడేజా మట్లాడాడు. ప్రతీ టోర్నీలో ఇండియా ఆటగాళ్లు వంద శాతం కృషి చేస్తారని తెలిపాడు. ఒక్కోసారి ఫలితాలు టీమ్‌కు అనుకూలంగా రాకపోవచ్చని అభిప్రాయపడ్డాడు. దానికి ఎవరూ ఏం చేయలేరని అన్నాడు. సాయశక్తుల ప్రతి మ్యాచ్‌ను గెలిచేందుకే ప్రయత్నాలు చేస్తాం.. కానీ కొన్నిసార్లు అనుకున్నట్లు అన్నీ జరగవు అని వ్యాఖ్యానించాడు. ఆటలో గెలుపోటములు సహజం అని చెప్పుకొచ్చాడు జడేజా. ప్రతి ఆటలో ఇరువురి జట్లు గెలుపుకోసమే ప్రయత్నిస్తాయని చెప్పాడు. అయితే.. ఆటల్లో ఫలితం కంటే ఎంత కృషి చేశామనేదే ముఖ్యమని రవీంద్ర జడేజా తెలిపాడు.

Next Story