భారత అత్యుత్తమ స్పిన్నర్లలో రవిచంద్రన్ అశ్విన్ ఒకరు. అతడి గణాంకాలు దీనికి స్పష్టంగా సాక్ష్యమిస్తున్నాయి. అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్ అశ్విన్, ప్రస్తుతం ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టాప్ బౌలర్‌గా కొనసాగుతున్నాడు. అశ్విన్ ఈరోజు తన 38వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. అశ్విన్ తన కెరీర్‌లో ఇప్పటివరకు చాలా గొప్ప రికార్డులను సాధించాడు. అయితే అశ్విన్ సాధించాలనుకునే ఓ రికార్డ్ కూడా ఉంది. తను కల కన్న ఓ రికార్డు ఇప్పటికీ నెరవేరలేదని అశ్విన్ స్వయంగా వెల్లడించాడు. అదేంటో తెలుసుకుందాం.
సెప్టెంబర్ 19 నుంచి భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌కు ముందు భారత జట్టు స్టార్ ఆఫ్ స్పిన్నర్ ఆర్ అశ్విన్ తన కోరికను వెల్లడించాడు. విమల్ కుమార్ యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ.. అశ్విన్ తన కలలలో ఒకటి ఇంకా అసంపూర్తిగా ఉందని చెప్పాడు. నేను ఒక ఓవర్‌లో 6 సిక్సర్లు కొట్టాలనుకున్నా.. అది ఎప్పుడూ జరగలేదని.. అశ్విన్ నవ్వుతూ చెప్పాడు. అశ్విన్ తన రిటైర్మెంట్ ప్లాన్ గురించి కూడా చెప్పాడు. ఇకపై తాను రాణించలేనని భావిస్తున్న రోజు తాను రిటైర్ అవుతానని పేర్కొన్నాడు. 2011లో వెస్టిండీస్‌పై అశ్విన్ టెస్టు అరంగేట్రం చేశాడు. అతడు 100 టెస్టు మ్యాచ్‌లు ఆడి 516 వికెట్లు తీశాడు. ఇప్పుడు బంగ్లాదేశ్ తో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఆడనున్నాడు.