నాలుగేళ్ల త‌రువాత చోటు ద‌క్క‌డంపై అశ్విన్ ట్వీట్‌

Ravichandran Ashwin on white-ball comeback.అక్టోబ‌ర్ 17 నుంచి న‌వంబ‌రు 14 వ‌ర‌కు యూఏఈ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Sep 2021 6:42 AM GMT
నాలుగేళ్ల త‌రువాత చోటు ద‌క్క‌డంపై అశ్విన్ ట్వీట్‌

అక్టోబ‌ర్ 17 నుంచి న‌వంబ‌రు 14 వ‌ర‌కు యూఏఈ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న టీ20 ప్ర‌పంచ క‌ప్‌లో పాల్గొనే భార‌త జ‌ట్టును బీసీసీఐ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. 15 మందితో కూడిన బృందంలో అంద‌రిని ఆశ్చ‌ర్య ప‌రుస్తూ.. సీనియ‌ర్ ఆట‌గాడు, ఆఫ్ స్సిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్‌కు చోటు ద‌క్కింది. ప‌రిమిత ఓవ‌ర్ల క్రికెట్ ఆడి అశ్విన్ దాదాపు నాలుగేళ్లు కావొస్తోంది. ప్ర‌స్తుతం అశ్విన్ వ‌య‌స్సు 34 ఏళ్లు.

కాగా.. అశ్విన్‌ను ఎంపిక చేయ‌డానికి గ‌ల కార‌ణాల‌ను చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ వివరించారు. యువ స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయ‌ప‌డ‌డంతో టీమ్‌కి ఆఫ్ స్పిన్న‌ర్ అవ‌స‌రం అయ్యాడు. అశ్విన్ గత కొన్నేళ్లుగా ఐపీఎల్‌లో చక్కగా రాణిస్తున్నాడు. అతను టీమ్‌కి ఆస్తి. టీ20 వరల్డ్‌కప్‌లో అతని అనుభవం టీమ్‌కి ఉపయోగపడనుంది. దాంతో.. అశ్విన్‌ని ఎంపిక చేశామ‌న్నాడు.

నాలుగేళ్ల త‌రువాత జ‌ట్టులో చోటు ద‌క్కిన అనంత‌రం అశ్విన్ ఇలా ట్వీట్ చేశాడు. ప్ర‌తి సొరంగం చివ‌ర‌న వెలుతురు ఉంటుంది. అయితే.. ఆ వెలుతురు చూడ‌గ‌ల‌మ‌ని న‌మ్మిన వాళ్లే దాన్ని చూసేందుకు బ‌తికుంటారు అని రాసిన ఫోటోను అశ్విన్ ట్వీట్ చేశాడు. ఈ మాట‌ల‌ను గోడ మీద రాయ‌డానికి ముందు కొన్ని ల‌క్ష‌ల సార్లు నా డైరీలో రాశాను. అవి మ‌నం చ‌దివే మాట‌ల‌ను అన్వ‌యించుకుని జీవితంలో ఆచ‌రిస్తే అవి మ‌న‌కు మ‌రింత ప్రేర‌ణ‌, బ‌లాన్ని ఇస్తాయ‌ని రాసుకొచ్చాడు. కాగా.. అశ్విన్ 2017 జులై 9న వెస్టిండీస్ పై చివ‌రిసారిగా టీ20 మ్యాచ్ ఆడాడు.

Next Story
Share it