రాజీవ్ ఖేల్‌ర‌త్న పేరు మార్పు.. ఇక మేజ‌ర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌ర‌త్న‌

Rajiv Khel Ratna renamed as Major Dhyanchand Khel Ratna.కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. క్రీడాకారుల‌కు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Aug 2021 7:53 AM GMT
రాజీవ్ ఖేల్‌ర‌త్న పేరు మార్పు.. ఇక మేజ‌ర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌ర‌త్న‌

కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. క్రీడాకారుల‌కు ఇచ్చే అత్య‌త్త‌మ పుర‌స్కారం 'రాజీవ్ ఖేల్‌ర‌త్న' పేరును మారుస్తున్న‌ట్లు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ట్వీట్ చేశారు. రాజీవ్ ఖేల్‌ర‌త్న పేరును 'మేజ‌ర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌ర‌త్న' అవార్డుగా మార్చారు. ఈ అవార్డు పేరును మార్చాల‌ని త‌న‌కు దేశ‌వ్యాప్తంగా పౌరుల నుంచి అనేక విన‌తులు అందాయ‌ని ఈ సంద‌ర్భంగా మోదీ ట్విట‌ర్‌లో వెల్ల‌డించారు. వాళ్ల సెంటిమెంట్‌ను దృష్టిలో ఉంచుకొని ఇక నుంచి ఖేల్‌ర‌త్న అవార్డు పేరును 'మేజ‌ర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న' అవార్డుగా మారుస్తున్న‌ట్లు ట్వీటులో పేర్కొన్నారు.

మాజీ ప్ర‌ధాని రాజీవ్‌గాంధీ జ్ఞాప‌కార్థం 1991-92లో దేశంలో ఈ అత్యున్న‌త క్రీడా పుర‌స్కారాన్ని ప్రారంభించారు. అప్ప‌టి నుంచి దాన్ని' రాజీవ్ గాంధీ ఖేల్ ర‌త్న' అవార్డుగానే ప‌రిగ‌ణిస్తున్నారు. దాని కింద ఒక ప్ర‌శంసా ప‌త్రం, ప‌త‌కం, న‌గ‌దు పుర‌స్కారం అందిస్తారు. సాధార‌ణంగా ఈ పుర‌స్కారాన్ని ప్ర‌క‌టించేందుకు ఏడాది ప్ర‌ద‌ర్శ‌న‌ను ప‌రిగ‌న‌లోకి తీసుకుంటారు. వ్య‌క్తిగ‌తంగా లేక జ‌ట్టుకు ఈ పుర‌స్కారం ఇస్తారు. కాగా.. ఇప్పుడు ఆ పేరు 'మేజ‌ర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌ర‌త్న‌'గా మారింది. హాకీ లెజెండ్ ధ్యాన్‌చంద్ జ‌యంతి అయిన ఆగ‌స్ట్ 29ని ఇప్ప‌టికే జాతీయ క్రీడా దినోత్స‌వంగా జ‌రుపుకుంటున్న విష‌యం తెలిసిందే.

Next Story