అట్ట‌హాసంగా రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కొత్త జెర్సీ లాంచ్‌.. వీడియో వైర‌ల్

Rajastan royals launched new jersey.ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్(ఐపీఎల్‌) 14వ సీజ‌న్‌కు ముందు రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టు త‌మ కొత్త జెర్సీని లాంచ్ చేసింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 April 2021 7:04 PM IST
Rajastan royals  jersy

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్(ఐపీఎల్‌) 14వ సీజ‌న్‌కు ముందు రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టు త‌మ కొత్త జెర్సీని లాంచ్ చేసింది. జైపూర్‌లో ఆదివారం రాత్రి స‌వాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో జెర్సీ ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం అట్ట‌హాసంగా జ‌రిగింది. జెర్సీని ఆవిష్క‌రించ‌డం కోసం స్టేడియంలో భారీ స్ర్కీన్‌ను ఏర్పాటు చేశారు. ముందుగా ఓ వీడియో మాంటేజ్‌ను ప్లే చేసిన త‌రువాత రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఆట‌గాళ్లు త్రీడీ ప్రొజెక్ష‌న్స్ రూపంలో కొత్త జెర్సీల్లో క‌నిపించారు.


కాగా.. ఈ కొత్త జెర్సీ లాంచింగ్ ప్రోగ్రామ్ అద్భుతంగా ఉంద‌ని క్రికెట్ ఫ్యాన్స్ అంటున్నారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ప్ర‌స్తుతం ముంబైలో రాజ‌స్థాన్ ఆట‌గాళ్లు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ నెల 12న పంజాబ్ కింగ్స్‌తో రాజ‌స్థాన్ త‌మ తొలి మ్యాచ్‌లో త‌ల‌ప‌డ‌నుంది. ఇక ఐపీఎల్ 2021 సీజ‌న్ ఏప్రిల్‌‌ 9న ఆరంభం కానుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియ‌న్ ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టును ఢీ కొట్ట‌నుంది. ఐపీఎల్ ఆరంభ సీజ‌న్‌లో క‌ప్పు గెలిచిన రాజ‌స్థాన్‌.. ఆ త‌రువాత ఆశించిన స్థాయిలో రాణించ‌లేదు. ఈ ఏడాది యంగ్ వికెట్ కీప‌ర్ సంజు శాంస‌న్ కెప్టెన్సీలో రాజ‌స్థాన్ బ‌రిలోకి దిగుతోంది. మ‌రోసారి క‌ప్పు సాధించాల‌న్న రాజ‌స్థాన్ ఆశ‌లు సంజు శాంస‌న్ అన్న తీరుస్తాడో లేదో చూడాలి.


Next Story