పంత్‌ సెంచరీ.. హెడ్‌కోచ్ ద్ర‌విడ్ రియాక్ష‌న్‌.. వైర‌ల్‌

Rahul Dravid's Animated Celebration After Rishabh Pant's Century Goes Viral.ఇంగ్లాండ్‌తో జ‌రుగుతున్న రీ షెడ్యూల్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 July 2022 7:59 AM GMT
పంత్‌ సెంచరీ.. హెడ్‌కోచ్ ద్ర‌విడ్ రియాక్ష‌న్‌.. వైర‌ల్‌

ఇంగ్లాండ్‌తో జ‌రుగుతున్న రీ షెడ్యూల్ టెస్టులో భార‌త్ తొలి రోజు ఆట ముగిసే స‌మ‌యానికి 338/7 స్కోరుతో నిలిచింది. 98 ప‌రుగుల‌కే 5 కీల‌క వికెట్లు కోల్పోయిన భార‌త్‌ను రిష‌బ్ పంత్ త‌న దైన శైలిలో ధ‌నాధ‌న్ బ్యాటింగ్‌తో ఆదుకున్నాడు. జ‌డేజాతో క‌లిసి ఆరో వికెట్‌కు 222 ప‌రుగుల కీల‌క భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పాడు. కేవ‌లం 111 బంతుల్లోనే 19 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 146 పరుగులు చేశాడు. త‌న‌పై విమ‌ర్శ‌లు చేస్తున్న వారికి బ్యాట్‌తోనే స‌మాధానం చెప్పాడు.

గ‌త కొంత‌కాలంగా పంత్ ఫామ్‌లో లేడు. అయిన‌ప్ప‌టికీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ మాత్రం అత‌డికి మ‌ద్ద‌తుగా నిలిచాడు. ఈ క్ర‌మంలో ద్రవిడ్ త‌న‌పై ఉంచిన న‌మ్మకాన్ని పంత్ నిల‌బెట్టుకున్నాడు. దీంతో ద్ర‌విడ్ ఉప్పొంగి పోయాడు. పంత్ సెంచ‌రీ చేసిన స‌మ‌యంలో ద్ర‌విడ్ ఒక్క‌సారిగా ఆరుస్తూ లేచి నిల‌బ‌డి గ‌ట్టిగా సంబ‌రాలు చేసుకున్నాడు. స‌హ‌జంగా ఎలాంటి ప‌రిస్థితుల్లోనైనా ద్ర‌విడ్ త‌న భావోద్వేగాల‌ను బ‌య‌ట పెట్ట‌డు. అలాంటిది నిన్న‌(శుక్ర‌వారం) పంత్ సెంచ‌రీ అనంత‌రం ద్రవిడ్ ఇచ్చిన రియాక్షన్ ఇప్పుడు నెటింట వైర‌ల్‌గా మారింది. పంత్ సెంచరీ కంటే ద్రవిడ్ రియాక్షనే హైలైట్ అని ప‌లువురు నెటీజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.

ఇక ద్ర‌విడ్ రియాక్ష‌న్‌పై మాజీ ఆటగాడు జ‌హీర్ ఖాన్ మాట్లాడుతూ.. క్లిష్ట‌ప‌రిస్థితుల్లో ఇలాంటి అద్భుత‌మైన ఇన్నింగ్స్‌ను చూసిన‌ప్పుడు ఎవ‌రికైనా భావోద్వేగాలు నియంత్రించుకోవ‌డం కాస్త క‌ష్ట‌మే. సాధార‌ణంగా ద్ర‌విడ్ ఎప్పుడూ ఇలా రియాక్ట్ అవ్వ‌డు అని జ‌హీర్ ఖాన్ అన్నాడు.

Next Story
Share it