ప్ర‌పంచ నంబ‌ర్ 1కు షాకిచ్చిన నాద‌ల్‌

Rafael Nadal Wins Epic Four Set Clash With Novak Djokovic in French Open 2022.ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టెన్నిస్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Jun 2022 6:02 AM GMT
ప్ర‌పంచ నంబ‌ర్ 1కు షాకిచ్చిన నాద‌ల్‌

ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నీలో స్పెయిన్ బుల్‌, మ‌ట్టి కోర్టు రారాజు రఫెల్ నాద‌ల్ అద‌ర‌గొట్టాడు. ప్ర‌పంచ నెంబ‌ర్ వ‌న్ ఆట‌గాడు నోవాక్ జకొవిచ్‌కు షాకిచ్చాడు. పురుషుల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్‌ చాంపియన్‌ ను ఓడించి సెమీఫైన‌ల్‌లో అడుగుపెట్టాడు. బుధ‌వారం తెల్ల‌వారుజామున జ‌రిగిన ఈ క్వార్ట‌ర్ ఫైన‌ల్‌లో 6-2, 4-6, 6-2, 7-6 (7/4) తేడాతో జ‌కోవిచ్ పై నాద‌ల్ విజ‌యం సాధించాడు. నాలుగు గంట‌ల 12 నిమిషాల పాటు ఈ మ్యాచ్ సాగింది. ఈ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో నాద‌ల్ సెమీస్‌కు చేర‌డం ఇది 15వ సారి. ఇక పైన‌ల్ బెర్త్ కోసం తొలిసెమీఫైన‌ల్‌లో నాద‌ల్‌.. అలెగ్జాండ‌ర్ జ్వెరేవ్‌(జ‌ర్మ‌నీ)తో త‌ల‌ప‌డ‌నున్నాడు.

జొకోవిచ్‌పై విజయానంతరం నాదల్‌ మాట్లాడుతూ.. ఎన్నెన్నో భావోద్వేగాలు త‌న‌ను చుట్టుముట్టాయని చెప్పాడు. ఇక్కడ ఆడటం నిజంగా త‌నకు ఎప్పుడూ ప్రత్యేకమేన‌ని అన్నాడు. అతడి(జొకోవిచ్‌)తో పోటీ పడటం అతిపెద్ద సవాలు అని, మనలోని అత్యుత్తమ ప్రతిభ కనబరిచినపుడు మాత్రమే అతడిని ఓడించే అవకాశం ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఈ క్ర‌మంలో ఉద్వేగానికి లోనైయ్యాడు.

అనంత‌రం జ‌కోవిచ్ మాట్లాడుతూ.. నాద‌ల్‌కు అభినంద‌న‌లు తెలిపాడు. అత‌డొక గొప్ప చాంఫియ‌న్ అని, ఈ విజ‌యానికి నాద‌ల్ అర్హుడు అంటూ ప్ర‌శంస‌లు కురిపించాడు.

Next Story
Share it