లెజెండరీ టెన్నిస్ ఆటగాడు.. రాఫెల్ నాదల్‌కు కరోనా పాజిటివ్‌

Rafael Nadal tests Covid-19 positive after Abu Dhabi event. లెజెండరీ స్పానిష్ టెన్నిస్ ఆటగాడు రాఫెల్ నాదల్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. నాదల్‌ అబుదాబి నుండి స్పెయిన్‌కు తిరిగి వచ్చిన

By అంజి  Published on  20 Dec 2021 12:43 PM GMT
లెజెండరీ టెన్నిస్ ఆటగాడు.. రాఫెల్ నాదల్‌కు కరోనా పాజిటివ్‌

లెజెండరీ స్పానిష్ టెన్నిస్ ఆటగాడు రాఫెల్ నాదల్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. నాదల్‌ అబుదాబి నుండి స్పెయిన్‌కు తిరిగి వచ్చిన తర్వాత కరోనా పరీక్షలు చేసుకోగా.. అతడికి పాజిటివ్‌ అని తెలిసింది. అబుదాబిలో నాదల్‌ ఒక టోర్నమెంట్‌ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ వార్తను ప్రకటించడానికి నాదల్ ట్విట్టర్‌లో ఇలా వ్రాశాడు. "అబుదాబి టోర్నమెంట్‌లో పోటీ చేసిన తర్వాత నేను ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, ఆర్టీ పీసీఆర్‌ పరీక్షలో కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చిందని, కరోనా లక్షణాలు కలిగి ఉన్నానని, త్వరలో ఆరోగ్యంగా బయటపడతానని అన్నారు. " అని తెలిపారు. త్వరలోనే భవిష్యత్ టోర్నమెంట్‌లపై తన ప్రణాళికల గురించి ప్రజలకు తెలియజేస్తానని చెప్పాడు.

ముబాదాలా ప్రపంచ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లో అయిన గాయం నుండి కోలుకున్న కొద్దిరోజులకే.. నాదల్‌కు కరోనా సోకింది. నాదల్‌ 20 సార్లు గ్రాండ్ స్లామ్ విజేతగా నిలిచాడు. అబుదాబిలో జరిగిన ఎగ్జిబిషన్ టోర్నమెంట్‌లో నాదల్ నాలుగు నెలల తర్వాత తన మొదటి మ్యాచ్‌ను శుక్రవారం ఆడాడు, ఆండీ ముర్రేతో వరుస సెట్లలో ఓడిపోయాడు. 20-సార్లు గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ దీర్ఘకాలిక ఫుట్ గాయం అతన్ని ఈ సీజన్ చివరి నెలల్లో కూర్చోబెట్టవలసి వచ్చింది. నాదల్ వాషింగ్టన్‌లో లాయిడ్ హారిస్ చేతిలో ఓడిపోయిన ఆగస్టు ప్రారంభం నుండి పోటీ చేయలేదు. అతను వింబుల్డన్, టోక్యో ఒలింపిక్స్, యూఎస్‌ ఓపెన్‌లకు దూరమయ్యాడు.

Next Story