టెన్నిస్ దిగ్గ‌జం, ర‌ఫెల్ నాద‌ల్ ఇంట వార‌సుడి సంద‌డి

Rafa Nadal and Mery Perello become parents for the first time.స్పెయిన్‌ బుల్ ర‌ఫెల్ నాద‌ల్ తండ్రి అయ్యాడు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Oct 2022 2:29 PM IST
టెన్నిస్ దిగ్గ‌జం, ర‌ఫెల్ నాద‌ల్ ఇంట వార‌సుడి సంద‌డి

టెన్నిస్ దిగ్గ‌జం, స్పెయిన్‌ బుల్ ర‌ఫెల్ నాద‌ల్ తండ్రి అయ్యాడు. నాద‌ల్ భార్య మ‌రియా ఫ్రాన్సిస్కా పెరెలో శ‌నివారం రాత్రి పండంటి మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. ఈ విష‌యాన్ని ఫుట్‌బాల్ క్ల‌బ్ రియ‌ల్ మాడ్రిడ్ తెలియ‌జేసింది. కుమారుడు ఇంట అడుగుపెట్ట‌డంతో నాద‌ల్ దంప‌తుల ఆనందానికి అవుధులు లేకుండా పోయాయి. స‌హ‌చ‌ర ఆట‌గాళ్ల‌తో పాటు అభిమానులు నాద‌ల్‌కు విషెష్ చెబుతున్నారు.

"కంగ్రాట్స్‌.. స్పెయిన్ బుల్ ఇప్ప‌టి దాకా తెలియ‌దు. నిజంగా శుభ‌వార్త‌. ఏ వ్య‌క్తి అయినా తాను తొలిసారి తండ్రి అయితే అక్క‌డ ఉండే ఆనంద‌మే వేరు. ఆ అనుభూతి నాద‌ల్ ఇప్పుడు పొందుతున్నాడు. నేను ఇప్ప‌టికే అలాంటి ఆనందాన్ని చూశా. నాద‌ల్‌కు ఎలాంటి స‌ల‌హా ఇవ్వ‌ను. ఎందుకంటే అత‌డికి పెద్ద కుటుంబం ఉంది. వాళ్లే అన్ని జాగ్ర‌త్త‌లు చెబుతారు." అని లాఫింగ్ ఎమోజీల‌ను మ‌రో టెన్నిస్ దిగ్గ‌జం, స‌హ‌చ‌ర ఆట‌గాడు నొవాక్ జొకోవిచ్ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

2019లో నాద‌ల్‌, మరియా పెళ్లి చేసుకున్నారు. కెరీర్‌పై ఫోక‌స్ పెట్టేందుకే కొద్ది రోజులు పిల్ల‌లు వ‌ద్ద‌నుకున్న‌ట్లు నాద‌ల్ గ‌తంలో ఓ సంద‌ర్భంలో చెప్పాడు. ప్ర‌స్తుతం నాద‌ల్ వ‌య‌స్సు 36 ఏళ్లు. త‌న కెరీర్‌లో నాద‌ల్ 22 గ్రాండ్‌స్లామ్‌లు గెలుపొందారు.

Next Story