తనపై వచ్చిన వార్తలపై స్పందించిన డికాక్
Quinton de Kock apologises after refusing to take knee.టీ20 వరల్డ్ కప్‌లో వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు 30 నిమిషాల ముందు
By M.S.R
టీ20 వరల్డ్ కప్‌లో వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు 30 నిమిషాల ముందు దక్షిణాఫ్రికా జట్టు వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ వ్యక్తిగత కారణాలతో తప్పుకుంటున్నట్లు మేనేజ్‌మెంట్‌కు తెలిపాడు. ఈ మ్యాచ్ తాను ఆడలేనని.. కొన్ని వ్యక్తిగత కారణాలు ఉన్నాయని అతడు జట్టు యాజమాన్యానికి చెప్పడంతో అతడి స్థానంలో వేరొకరిని తీసుకున్నారు. మ్యాచ్‌కు ముందు అందరూ బ్లాక్ లైవ్స్ మ్యాటర్ (బీఎల్ఎం)కు మద్దతుగా మోకాలిపై నిలబడాలని క్రికెట్ సౌత్ ఆఫ్రికా (సీఎస్ఏ) అందరు ఆటగాళ్లకు ఆదేశాలు జారీ చేసింది. నల్లజాతీయులపై జరుగుతున్న వివక్షకు వ్యతిరేకంగా బీఎల్ఎం ఉద్యమం ప్రారంభమైంది. ఐసీసీ కూడా ఈ ఉద్యమానికి మద్దతుగా నిలిచింది. టీ20 వరల్డ్ కప్ సందర్భంగా ప్రతీ మ్యాచ్‌కు ముందు బీఎల్ఎంకు మద్దతు తెలియజేస్తున్నారు.
డికాక్ విషయంలో అది వివాదంగా మారింది. దీంతో తాను చేసిన పనికి తాజాగా క్షమాపణలు చెప్పాడు డికాక్. నేను బోర్డుతో మాట్లాడిన తర్వాత నాకు అర్ధం అయిందని అన్నాడు. మోకాలు పైన కూర్చోవడం సంతోషంగా ఉంది అని అన్నాడు. అయితే మొదట బోర్డు ఆదేశాన్ని జారీ చేయడంతో నా హక్కులు హరించబడ్డాయని భావించానని చెప్పిన డికాక్ ఇప్పుడు క్షమాపణలు కోరుతూ ప్రస్తుతం నన్ను అది చేయమంటే చేస్తాను అని అన్నాడు. తాను క్షమాపణ చెబుతున్నట్టు ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ బహిరంగ లేఖను విడుదల చేశాడు. ఇకనుంచి ఇలా ప్రవర్తించబోనని హామీ ఇచ్చాడు.
Quinton de Kock statement 📝 pic.twitter.com/Vtje9yUCO6
— Cricket South Africa (@OfficialCSA) October 28, 2021
లేఖలో డికాక్.. 'నేను దీనిని ఎప్పుడూ సమస్యగా మార్చాలని అనుకోలేదు. జాత్యాహంకారినికి వ్యతిరేకంగా నిలబడటం ప్రాముఖ్యతను నేను అర్థం చేసుకున్నాను. అంతేగాక క్రీడాకారుల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడంలో ఉన్న బాధ్యతనూ తెలుసుకున్నాను. ఒకవేళ నేను మోకాళ్ల మీద కూర్చోవడం ద్వారా అది ఇతరులకు రేసిజం గురించి అవగాహన కల్పిస్తుందనుకుంటే ఆ బాధ్యతను నేను సంతోషంగా స్వీకరిస్తాను' అని తెలిపాడు. ఎట్టకేలకు డికాక్ ఈ వివాదానికి తెరదించాడు.