ఆశ‌ల‌న్నీ సింధుపైనే.. సింగ‌పూర్ ఓపెన్‌లో ఫైన‌ల్ చేరిన తెలుగు తేజం

PV Sindhu sails into Singapore Open final.తెలుగుతేజం, భార‌త అగ్ర‌శ్రేణి ష‌ట్ల‌ర్ పీవీ సింధు సింగ‌పూర్ ఓపెన్ వ‌ర‌ల్డ్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 July 2022 3:05 PM IST
ఆశ‌ల‌న్నీ సింధుపైనే.. సింగ‌పూర్ ఓపెన్‌లో ఫైన‌ల్ చేరిన తెలుగు తేజం

తెలుగుతేజం, భార‌త అగ్ర‌శ్రేణి ష‌ట్ల‌ర్ పీవీ సింధు సింగ‌పూర్ ఓపెన్ వ‌ర‌ల్డ్ టూర్ సూప‌ర్ 500 బ్యాడ్మింట‌న్ టోర్నీలో అద‌ర‌గొడుతోంది. శ‌నివారం జ‌రిగిన సెమీఫైన‌ల్ మ్యాచ్‌లో విజ‌యం సాధించి ఫైన‌ల్‌కు దూసుకువెళ్లింది. సెమీస్‌లో జపాన్ షట్లర్ సయేనా కవాకమిని 21-15, 21-7 తేడాతో ఓడించింది. సింధూ ధాటికి కేవ‌లం 31 నిమిషాల్లోనే ప్ర‌త్య‌ర్థి తోక ముడిచింది.

మ్యాచ్ ఆరంభం నుంచి సయేనా కవాకమిపై పూర్తి స్థాయిలో ఆధిప‌త్యం చెలాయించింది సింధు. ఏ ద‌శ‌లోనూ ప్ర‌త్యర్థికి చిన్న అవకాశం ఇవ్వ‌కుండా ఫైన‌ల్ చేరింది. ఏడో ర్యాంకులో ఉన్న సింధు 38 ర్యాంక‌ర్ అయిన క‌వాక‌మి పై ఇప్ప‌టి వ‌ర‌కు మూడు సార్లు విజ‌యం సాధించింది. ఇక సింధు త‌న కెరీర్‌లో తొలి సూప‌ర్ 500 టైటిల్‌ను గెలిచేందుకు కేవ‌లం అడుగు దూరంలో నిలిచింది. ఆదివారం ఫైన‌ల్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

ఆశ‌ల‌న్నీ సింధుపైనే

సింగపూర్ ఓపెన్‌లో ఇప్పుడు టైటిల్ ఆశలన్నీ పీవీ సింధుపైనే ఉన్నాయి. ఇప్పటికే సైనా నెహ్వాల్, హెచ్‌ఎస్ ప్రణయ్ టోర్నీ నుంచి నిష్క్రమించారు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో జపాన్‌కి చెందిన అయా ఒహోరి చేతిలో సైనా ఓడిపోగా జపాన్‌కే చెందిన కొడాయ్ నరవొక చేతిలో హెచ్‌ఎస్ ప్రణయ్ పరాజయాన్ని చవిచూశాడు.

Next Story