ప్రపంచ స్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు.. భుబన్ బద్యాకర్ యొక్క ప్రముఖ బెంగాలీ పాట కచా బాదమ్‌కు డ్యాన్స్ చేస్తూ ట్రెండింగ్ వీడియోను పోస్ట్ చేసింది. ఈ ట్రెండింగ్ వీడియో మార్చి 7న సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. ఇప్పటికే ఈ వీడియోకు 3 మిలియన్లకు వ్యూస్ వచ్చాయి. వైరల్ వీడియోలో పసుపు రంగు దుస్తులు ధరించిన పీవీ సింధు కచ్చా బాదమ్ పాటకు డ్యాన్స్ చేస్తూ కనిపించింది. డ్యాన్స్‌లో ఆమె సహజంగా నటించింది. పీవీ సింధు డ్యాన్స్ వీడియో ఇంటర్నెట్‌లో విపరీతంగా హిట్ అయింది. వినియోగదారులు ఆమె వీడియోను ప్రశంసించారు. ఆమె అద్భుతమైన క్రీడాకారిణి మాత్రమే కాదు, అందమైన నృత్యకారిణి కూడా అంటూ కామెంట్లు పెడుతున్నారు.
పశ్చిమ బెంగాల్‌కు చెందిన వేరుశెనగలు అమ్ముకునే భుబన్ బద్యాకర్ రూపొందించిన బెంగాలీ పాట కచా బాదం. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన పాటల్లో కచా బాదం ఒకటి. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఈ పాటకు అడిక్ట్ అయ్యారు. బెంగాలీ పాట 'కచా బాదం' ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారి ఒక నెల దాటిపోయింది. వేలాది మంది ప్రజలు కచా బాదం పాటకు డ్యాన్స్ చేస్తూ తమ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. తన సైకిల్‌పై గ్రామ గ్రామాన వేరుశెనగను విక్రయిస్తూ కొనుక్కునేవారిని ప్రలోభపెట్టడానికి ఈ పాటను భుబన్ బద్యాకర్ పాడాడు. ఈ పాట ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్‌గా మారింది. ఈ పాట పిల్లల నుండి వృద్ధుల వరకు అన్ని వయసుల వారు ఇష్టపడతారు.