సింగ‌పూర్ ఓపెన్ విజేత పీవీ సింధు

PV Sindhu beats Wang Zhi Yi to claim her maiden Singapore Open.తెలుగుతేజం, భార‌త అగ్ర‌శ్రేణి ష‌ట్ల‌ర్ పీవీ సింధు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 July 2022 12:37 PM IST
సింగ‌పూర్ ఓపెన్ విజేత పీవీ సింధు

తెలుగుతేజం, భార‌త అగ్ర‌శ్రేణి ష‌ట్ల‌ర్ పీవీ సింధు సింగ‌పూర్ ఓపెన్ వ‌ర‌ల్డ్ టూర్ సూప‌ర్ 500 బ్యాడ్మింట‌న్ టోర్నీలో అద‌ర‌గొట్టింది. సింధు ఖాతాలో మ‌రో టైటిల్ వ‌చ్చి చేరింది. సింగ‌పూర్ ఓపెన్ విజేత‌గా సింధు నిలిచింది. చైనాకు చెందిన వ్యాంగ్ జీ తో ఆదివారం జ‌రిగిన ఫైన‌ల్ పోరులో సింధు 21-9, 11-21, 21-15 తేడాతో విజ‌యం సాధించింది.

సెమీస్‌లో కవాకమిని 21-15, 21-7 తేడాతో సులువుగానే ఓడించిన సింధుకు ఫైన‌ల్‌లో కాస్త ప్ర‌తి ఘ‌ట‌న ఎదురైంది. తొలి సెట్‌ను సింధు అల‌వోక‌గా గెలిచింది. అయితే అద్భుతంగా పుంజుకున్న వ్యాంగ్ జీ రెండో సెట్‌ని గెలిచింది. దీంతో మ్యాచ్ ఉత్కంఠ‌కు దారి తీసింది. ఈ ద‌శ‌లో ఎటువంటి త‌ప్పిదాల‌కు అవ‌కాశం ఇవ్వ‌కండా, ఒత్తిడికి త‌లొగ్గ‌కుండా త‌న కున్న అనుభ‌వాన్ని అంతా చూపిస్తూ అద్భుత షాట్ల‌తో సింధు అల‌రించింది. మూడో సెట్‌తో పాటు ఫైన‌ల్ మ్యాచ్‌ను గెలిచింది. దీంతో ఈ ఏడాది సింధు ఖాతాలో మూడు టైటిల్‌లు చేరాయి.

జులై 18 నుంచి తైపీ ఓపెన్‌

యోనెక్స్‌ తైపీ ఓపెన్‌గా పిలవబడే తైపీ ఓపెన్‌ జులై 19 నుంచి 24 వరకూ జరుగనుంది. ప్రస్తుతం సింగపూర్‌ ఓపెన్‌ కోసం స్విస్‌ వెళ్లిన భారత బ్యాడ్మింటన్‌ బృందం అక్కడి నుంచి తైవాన్‌ వెళ్లనుంది. తైపీ ఓపెన్‌ సింగిల్స్‌ టైటిల్‌ గెలిచిన ఏకైక భారత బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌గా 2008లో సైనా నెహ్వాల్‌ రికార్డు క్రియేట్‌ చేసింది. పురుషుల బ్యాడ్మింటన్‌ ప్లేయర్లు కూడా ఎవరూ ఈ టైటిల్‌ గెలవలేకపోయారు. పీవీ సింధు సహా మిగిలిన ప్లేయర్లు ఎవరూ తైపీ ఓపెన్‌లో ఫైనల్‌ కూడా చేరలేకపోయారు. సింగ‌పూర్ ఓపెన్ గెలిచిన సింధు తైపీ ఓపెన్‌లో ఎలా రాణిస్తుందో చూడాలి.

Next Story