టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్

ఐపీఎల్ లో నేడు మరో ఆసక్తికర పోరు మొదలైంది. గుజరాత్ టైటాన్స్ జట్టుతో పంజాబ్ కింగ్స్ పోటీ పడనుంది.

By Medi Samrat  Published on  4 April 2024 1:47 PM
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్

ఐపీఎల్ లో నేడు మరో ఆసక్తికర పోరు మొదలైంది. గుజరాత్ టైటాన్స్ జట్టుతో పంజాబ్ కింగ్స్ పోటీ పడనుంది. టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. మేము ముందుగా బౌలింగ్ చేయబోతున్నామని.. ఇది మంచి వికెట్ అని నేను భావిస్తున్నానని ధావన్ చెప్పుకొచ్చాడు. మేము ఛేజింగ్‌ చేయాలని అనుకుంటున్నట్లు తెలిపాడు. మేము మంచి క్రికెట్ ఆడుతున్నామని.. టోర్నమెంట్‌లో ప్రారంభ రోజులు మాత్రమే.. ఇంకా మెరుగ్గా ఆడబోతున్నామని తెలిపాడు ధావన్. సికందర్ రజా జట్టులోకి వచ్చాడని ధావన్ చెప్పుకొచ్చాడు.

పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): శిఖర్ ధావన్ (సి), జానీ బెయిర్‌స్టో, జితేష్ శర్మ (w), ప్రభ్‌సిమ్రాన్ సింగ్, సామ్ కర్రాన్, శశాంక్ సింగ్, సికందర్ రజా, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబాడ, అర్ష్‌దీప్ సింగ్

గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): వృద్ధిమాన్ సాహా(w), శుభమాన్ గిల్(c), సాయి సుదర్శన్, కేన్ విలియమ్సన్, విజయ్ శంకర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఉమేష్ యాదవ్, దర్శన్ నల్కండే

Next Story