రుతురాజ్ గైక్వాడ్-సంజూ శాంసన్ ఇద్ద‌రిలో ఎవరు ఎక్కువ దురదృష్టవంతుడు.? స‌మాధాన‌మిచ్చిన స్పిన్న‌ర్‌

రుతురాజ్ గైక్వాడ్, సంజూ శాంసన్ ఇద్ద‌రిలో ఎవరు ఎక్కువ దురదృష్టవంతురన్న ప్రశ్నకు పీయూష్ చావ్లా సమాధానమిచ్చారు

By Medi Samrat  Published on  13 Sept 2024 2:49 PM IST
రుతురాజ్ గైక్వాడ్-సంజూ శాంసన్ ఇద్ద‌రిలో ఎవరు ఎక్కువ దురదృష్టవంతుడు.? స‌మాధాన‌మిచ్చిన స్పిన్న‌ర్‌

రుతురాజ్ గైక్వాడ్, సంజూ శాంసన్ ఇద్ద‌రిలో ఎవరు ఎక్కువ దురదృష్టవంతురన్న ప్రశ్నకు పీయూష్ చావ్లా సమాధానమిచ్చారు. ఇద్దరూ స్నేహితులని చావ్లా తెలిపారు. ఇది చాలా కష్టమైన ప్రశ్న అని పీయూష్ చావ్లా అన్నారు. నేను వారిని దురదృష్టవంతులు అని పిలవను. అద్భుతమైన సత్తా ఉన్నా జట్టులో చోటు దక్కించుకోలేని ఆటగాళ్లు భారత్‌లో చాలా మంది ఉన్నారు. వీరిలో రుతురాజ్ గైక్వాడ్, సంజూ శాంసన్‌లు ఉన్నారు. వీరిద్దరూ బ్యాట్స్‌మెన్‌గా అద్భుత ప్రతిభ కనబరుస్తూ చాలాసార్లు నిరూపించుకున్నారు, అయినప్పటికీ వీరిద్దరూ భారత జట్టులో చోటు దక్కించుకోవడం చాలా అరుదు అని పేర్కొన్నాడు.

రీసెంట్‌గా రీతురాజ్ గైక్వాడ్‌ను 'మహారాష్ట్ర సంజు శాంసన్' అని పిలిచారు. దీంతో శుభంకర్ మిశ్రా పోడ్‌కాస్ట్‌లో.. ఈ ఇద్దరిలో ఎవరు ఎక్కువ దురదృష్టవంతుడు అని పియూష్ చావ్లాను ఒక ప్రశ్న అడిగారు. దానికి చావ్లా సమాధానం ఇచ్చారు. పీయూష్ చావ్లా మాట్లాడుతూ.. అతడికి అవకాశం దొరికినప్పుడల్లా అతడు వచ్చి భిన్నంగా ఆడుతాడు. ఇద్దరూ స్నేహితులు, ఇది కొంచెం కష్టమైన ప్రశ్న. నేను అతడిని దురదృష్టవంతుడు అని పిలవను. ఎందుకంటే జట్టులో ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతాయ‌న్నారు.

దులీప్ ట్రోఫీలో సంజూ శాంసన్ భారత్-డిలో ఆడుతున్నాడు. రితురాజ్ గైక్వాడ్ ఒక జట్టుకు కెప్టెన్ గా ఉన్నాడు. శాంసన్ చివరిసారిగా శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో భారత్ తరఫున ఆడాడు.

Next Story