కోహ్లీ బ‌దులు బ్యాటింగ్ చేయ‌డానికి వ‌చ్చేశాడు.. వీడెవ‌డండీ బాబూ

Pitch invader Jarvo 69 walks casually to bat after fall of Rohit Sharma’s wicket.లీడ్స్ వేదిక‌గా భార‌త్-ఇంగ్లాండ్ జ‌ట్ల

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 Aug 2021 7:55 AM GMT
కోహ్లీ బ‌దులు బ్యాటింగ్ చేయ‌డానికి వ‌చ్చేశాడు.. వీడెవ‌డండీ బాబూ

లీడ్స్ వేదిక‌గా భార‌త్-ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఓట‌మి నుంచి త‌ప్పించుకునేందుకు టీమ్ఇండియా అసాధారణంగా పోరాడుతోంది. ఇంత‌టి టెన్ష‌న్ స‌మ‌యంలో ఓ ఫ్రాంక్‌స్ట‌ర్ మాత్రం అభిమానుల‌ను క‌డుపుబ్బా నవ్విస్తున్నాడు. భార‌త జ‌ట్టు త‌రుపున అది కూడా ప‌రుగుల యంత్రం, కెప్టెన్ విరాట్ కోహ్లీ స్థానంలో బ్యాటింగ్ చేసేందుకు మైదానంలోకి వ‌చ్చేశాడు. అత‌డు చేసిన ప‌ని భ‌ద్ర‌తా సిబ్బందిని మైదానంలో ప‌రుగులు పెట్టించ‌గా.. భార‌త ఆట‌గాళ్ల భ‌ద్ర‌త‌ను ప్ర‌శ్నార్థ‌కంగా మార్చేసింది.

మూడో రోజు ఆటలో హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ‌ను వివాదాస్ప‌ద రీతిలో ఔట్ ఇచ్చిన స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఆ స‌మ‌యంలో ప్రాంక్ స్టార్ జార్వో.. ప్యాడ్లు, హెల్మెట్ ధ‌రించి భార‌త ఆట‌గాడి స్థానంలో బ్యాటింగ్ చేసేందుకు మైదానంలోకి వ‌చ్చేశాడు. అయితే.. ముఖానికి మాత్రం మాస్క్‌ను అలాగే ఉంచుకున్నాడు. గుర్తించిన సెక్యురిటీ సిబ్బందిని అత‌డిని మైదానం వెలుప‌లికి ఈడ్చిపారేశారు.

కాగా.. అత‌డు ఇలా చేయ‌డం కొత్తేమీ కాదు.. లార్డ్స్‌లో జ‌రిగిన రెండో టెస్టులో సైతం భార‌త జెర్సీ ధ‌రించి మైదానంలోకి వ‌చ్చాడు. బౌలింగ్ చేసేందుకు రెడీ అయ్యాడు. అక్క‌డి వెళ్లు.. దూరంగా నిల‌బ‌డు అంటూ సైగ‌లు చేసి ఫీల్డింగ్ సెట్ చేశాడు. ఆల్‌రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా, మ‌హ్మ‌ద్ సిరాజ్‌లు అత‌డిని నిజంగానే ఆట‌గాడిగా భావించారు. చివ‌రికి అత‌డు ఫ్రాంక్‌స్టార్ అని తెలియ‌డంతో వారిద్ద‌రు న‌వ్వును అపుకోలేక‌పోయారు. సెక్యురిటీ సిబ్బంది అత‌డిని బ‌య‌టికి పంపించేందుకు య‌త్నించ‌గా.. జెర్సీపై ఉన్న బీసీసీఐ లోగోని వారికి చూపించి.. వారితో వాగ్వాదానికి దిగాడు. వారు అత‌డిని బ‌య‌ట‌కు తీసుకెళ్ల‌డానికి అప‌సోపాలు ప‌డ్డారు. అయితే.. అత‌డు ప్ర‌తిసారి సెక్యురిటి సిబ్బంది క‌ళ్లు గ‌ప్పి మైదానంలోకి ఎలా అడుగుపెడుతున్నాడో ఎవ్వ‌రికి అర్థం కావ‌డం లేదు.

Next Story
Share it