హైబ్రిడ్ మోడల్‌కు అంగీక‌రించిన పీసీబీ.. కానీ.. ఓ మెలిక పెట్టింది..!

ఛాంపియన్స్ ట్రోఫీ కోసం హైబ్రిడ్ మోడల్‌ను అంగీకరించడానికి పీసీబీ సిద్ధంగా ఉంది,

By Medi Samrat  Published on  30 Nov 2024 1:16 PM GMT
హైబ్రిడ్ మోడల్‌కు అంగీక‌రించిన పీసీబీ.. కానీ.. ఓ మెలిక పెట్టింది..!

ఛాంపియన్స్ ట్రోఫీ కోసం హైబ్రిడ్ మోడల్‌ను అంగీకరించడానికి పీసీబీ సిద్ధంగా ఉంది, అయితే దీని కోసం పాకిస్తాన్ ఐసీసీ ముందు ఒక షరతు పెట్టింది. ఐసీసీ ఈవెంట్లలో హైబ్రిడ్ మోడల్ విధానాన్ని అవలంబిస్తే.. వచ్చే ఛాంపియన్స్ ట్రోఫీకి హైబ్రిడ్ మోడల్‌ను అంగీకరించేందుకు బోర్డు సిద్ధంగా ఉందని పాకిస్థాన్ తెలిపింది.

అయితే.. ఈ మోడల్‌ను అంగీకరించడానికి పాకిస్తాన్ బోర్డు వార్షిక ఆదాయ చక్రంలో ఎక్కువ వాటాను కూడా కోరుకుంటుందని పీసీబీ అగ్రశ్రేణి వార్తా సంస్థ పీటీఐకి తెలిపింది. 'ప్రస్తుత పరిస్థితి ఏమిటంటే.. భవిష్యత్తులో ఐసీసీ పోటీలన్నీ ఈ విధానంలోనే జరుగుతాయని.. పాకిస్తాన్ భారత్‌లో మ్యాచ్‌లు ఆడదని బోర్డు అంగీకరిస్తేనే హైబ్రిడ్ మోడల్‌లో ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించడానికి అంగీకరిస్తామ‌ని పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ చెప్పారు.

Next Story