పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)కు వరుసగా దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. భద్రతా కారణాల దృష్ట్యా తొలి వన్డేకు ముందు న్యూజిలాండ్ క్రికెట్ జట్టు తమ పర్యటనను రద్దు చేసుకోని వెళ్లగా.. ఇంగ్లాండ్ జట్టు పాక్ పర్యటనను రానని చెప్పేసింది. ఈ రెండు దేశాల పర్యటనలు రద్దు కావంతో పాక్ క్రికెట్ బోర్డు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయింది. స్పాన్సర్లు, టికెట్ల విక్రయాల రూపంలో రావాల్సిన ఆదాయాన్ని కోల్పోయింది.
ఇదిలా ఉంటే.. తాజాగా మరో అదనపు భారం పీసీబీ మీద పడింది. చాలా సంవత్సరాల తరువాత ఓ పెద్ద జట్టు పాక్‌లో పర్యటనకు రావడంతో.. కివీస్ టీమ్‌కు భారీ భద్రతను ఏర్పాటు చేసింది. కివీస్ క్రికెట్ టీమ్ బస చేసిన హోటల్ మొదలుకుని స్టేడియానికి చేరుకునేంత వరకూ వెన్నంటి ఉండేలా ఐదుగురు ఎస్పీలు, 500 మంది ఎస్ఎస్‌పీలను వెంట ఉంచారు. వీళ్లకుతోడు పాకిస్థాన్ ఆర్మీని కూడా ఇస్లామాబాద్, రావల్పిండిలో రంగంలోకి దించారు.
వారం రోజుల పాటు వారు న్యూజిలాండ్ క్రికెట్ జట్టు వెంటే ఉన్నారు. ఈ వారం రోజుల వ్యవధిలో ఈ భధ్రతా సిబ్బంది, పోలీసులకు రెండు పూటల బిర్యానీలు పెట్టింది. ఆ బిర్యాలనీల ఖర్చే రూ.27లక్షలు అయ్యిందట. ఇందుకు సంబంధించిన బిల్లును క్రికెట్ బోర్డుకు పంపించారట. ఇప్పటికే సిరీస్‌లు రద్దై తీవ్రంగా నష్టపోయిన పీసీబీ..ప్రస్తుతం ఈ బిర్యానీ బిల్లును ఎలా చెల్లించాలో తెలియక తల పట్టుకుందట.