భార‌త్‌తో త‌ల‌ప‌డే పాకిస్థాన్ జ‌ట్టు ఇదే

PCB Announced Pakistan T20 World Cup 2021 Squad.పొట్టి స‌మ‌రానికి స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో ఒక్కొ జ‌ట్టు మెగా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Sept 2021 2:16 PM IST
భార‌త్‌తో త‌ల‌ప‌డే పాకిస్థాన్ జ‌ట్టు ఇదే

పొట్టి స‌మ‌రానికి స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో ఒక్కొ జ‌ట్టు మెగా స‌మ‌రంలో పాల్గొనే ఆటగాళ్ల జాబితాను విడుద‌ల చేస్తున్నాయి. ఈ ఏడాది భార‌త్ వేదిక‌గా టీ20 ప్ర‌పంచ క‌ప్ జ‌ర‌గాల్సి ఉండ‌గా.. క‌రోనా కార‌ణంగా యూఏఈలో నిర్వ‌హిస్తున్నారు. అక్టోబ‌ర్ 17 నుంచి న‌వంబ‌ర్ 14 వ‌ర‌కు ఈ మెగా టోర్నీ జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జ‌ట్లు ఈ మెగా టోర్నీలో పాల్గొనే జ‌ట్ల‌ను ప్ర‌క‌టించ‌గా.. తాజాగా పాకిస్థాన్ కూడా ఆ జాబితాలో చేరింది. 15 మందితో కూడిన జాబితాను పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు(పీసీబీ) ప్ర‌క‌టించింది. వీరితో పాటు మ‌రో ముగ్గురు ఆట‌గాళ్ల‌ను రిజ‌ర్వ్ ప్లేయ‌ర్లుగా ఎంపిక చేసింది.

ఈ జ‌ట్టుకు బాబర్‌ అజమ్ నేతృత్వం వ‌హించ‌నున్నాడు. జ‌ట్టులో యువ ఆట‌గాళ్ల‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. సీనియ‌ర్ ఆట‌గాళ్లు అయిన షోయ‌బ్ మాలిక్‌, స‌ర్ప‌రాజ్ అహ్మ‌ద్‌, వాహ‌బ్ రియాజ్‌లను ఎంపిక చేయ‌లేదు. ఐదుగురు స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌మన్‌, ఇద్దరు వికెట్‌ కీపర్స్‌, నలుగురు ఆల్‌రౌండర్స్‌, నలుగురు ఫాస్ట్‌ బౌలర్స్ ల‌తో కూడిన జ‌ట్టును ప్ర‌క‌టించింది. ఫఖర్‌ జమన్‌, ఉస్మాన్‌ ఖాదీర్, షాహనవాజ్‌ దహానిలను రిజర్వ్‌ ఆటగాళ్లుగా తీసుకుంది.

టీ20 ప్ర‌పంచ క‌ప్‌లో భార‌త్‌, పాకిస్థాన్ జ‌ట్టు ఒకే గ్రూప్‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. గ్రూఫ్‌ 2లో భాగంగా భారత్‌,పాకిస్తాన్‌,న్యూజిలాండ్‌,అఫ్గానిస్తాన్‌,బి1 క్వాలిఫయర్‌, ఏ2 క్వాలిఫయర్‌ జట్లు ఉన్నాయి. కాగా.. భార‌త్‌, పాకిస్థాన్‌ల మ‌ధ్య అక్టోబ‌ర్ 24న తొలి మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

పాకిస్థాన్ టీ20 ప్రపంచకప్ జ‌ట్టు ఇదే..

బాబర్ ఆజామ్(కెప్టెన్), షాదాబ్ ఖాన్, అసిఫ్ అలీ, ఆజామ్ ఖాన్, హారీస్ రౌఫ్ హసన్ అలీ, ఇమాద్ వసీం, కుష్‌దిల్, హఫీజ్, హస్నైన్, నవాజ్, రిజ్వాన్, వాసిమ్, షాహిన్, మక్సూద్‌

రిజర్వ్ ఆటగాళ్లు.. దహని, ఉస్మాన్ ఖాదీర్, ఫకార్ జమాన్‌.

Next Story