కేకేఆర్‌తో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. బానుక రాజపక్స 50 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ శిఖర్ ధావన్ 40 రాణించాడు. ఓ దశలో పంజాబ్ 200 పైగా స్కోరు చేస్తుందని భావించారు. కానీ ఆఖరి ఓవర్లలో పరుగుల వేగం మందగించింది. చివర్లో సామ్ కరన్ 17 బంతుల్లో రెండు సిక్సర్ల సాయంతో 26 నాటౌట్, షారుక్ ఖాన్ ఏడు బంతుల్లో 11 పరుగులు నాటౌట్ గా మిగిలారు. కేకేఆర్ బౌలర్లలో టిమ్ సౌథీ రెండు వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి, ఉమేశ్ యాదవ్, సునీల్ నరైన్‌లు తలా ఒక వికెట్ తీశారు.
192 పరుగుల లక్ష్యఛేదనతో క్రీజులోకి దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ స్కోరు 146 పరుగులకు ఏడు వికెట్లు ఉన్న దశలో వర్షం ఆటకు అంతరాయంగా మారింది. క్రీజులో సునీల్ నరైన్(7), శార్దూల్ ఠాకూర్(8) పరుగులతో ఉన్నారు. ఈ దశలో మొదలైన వర్షం ఎంతకూ ఆగకపోవడంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం పంజాబ్ కింగ్స్‌ను విజేతగా ప్రకటించారు. ప్రస్తుతమున్న స్కోరు ప్రకారం 7 పరుగుల తేడాతో విజయం సాధించినట్లు ప్రకటించారు. కేకేఆర్ బ్యాట్స్‌మెన్‌లలో రసెల్(35), వెంకటేశ్ అయ్యర్(34) పరుగులతో పర్వాలేదనిపించారు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్ మూడు వికెట్లతో రాణించాడు. మరో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి.