శ్రీలంక స్టార్ ఓపెనర్ పాతుమ్ నిస్సాంక చరిత్ర సృష్టించాడు. శ్రీలంక తరుపున వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. శుక్రవారం పల్లెకెలె ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్ మధ్య 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా మొదటి మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక ఓపెనర్ పాతుమ్ నిస్సాంక(210) విధ్వంసకర ఇన్నింగ్సు ఆడాడు. తద్వారా శ్రీలంక తరఫున వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.
25 ఏళ్ల శ్రీలంక ఓపెనర్ పాతుమ్ నిస్సాంక 139 బంతులు ఎదుర్కొని 151 స్ట్రైక్ రేట్‌తో అజేయంగా 210 పరుగులు చేశాడు. తన ఇన్నింగ్స్‌లో 20 ఫోర్లు, 8 సిక్సర్‌లను బాదాడు. దీంతో వన్డేల్లో శ్రీలంక తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు. అంతకుముందు శ్రీలంక దిగ్గజ ఓపెనర్ సనత్ జయసూర్య పేరిట ఈ రికార్డు ఉంది ఉంది. జయసూర్య 2000లో భారత్‌పై 189 పరుగులు చేశాడు.