ఎంఎస్‌ ధోనీ గురించి యంగ్‌ బౌలర్ పతిరణ ఆసక్తికర కామెంట్స్

ఎంఎస్‌ ధోనీ గురించి అందరికీ తెలిసిందే. ఆయన కూల్‌గా ఉంటూ.. యువ క్రికెటర్లను బాగా ప్రోత్సహిస్తుంటారు.

By Srikanth Gundamalla  Published on  4 May 2024 6:32 PM IST
pathirana,  ms dhoni, cricket, ipl-2024,

 ఎంఎస్‌ ధోనీ గురించి యంగ్‌ బౌలర్ పతిరణ ఆసక్తికర కామెంట్స్ 

ఎంఎస్‌ ధోనీ గురించి అందరికీ తెలిసిందే. ఆయన కూల్‌గా ఉంటూ.. యువ క్రికెటర్లను బాగా ప్రోత్సహిస్తుంటారు. తన అనుభాన్ని పంచుకుంటూ మరిన్ని మెళకువలు నేర్పిస్తూ స్ట్రాంగ్‌గా తయారు చేస్తుంటారు. టీమిండియా తరఫున కుర్రాళ్లకు అవకాశాలు కల్పించిన అతడు ఐపీఎల్‌లో సాధారణ జట్టుతో అద్భుతాలు సృష్టించాడు. ఎంఎస్‌ ధోనీ ప్రస్తుతం ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్నాడు. ఇప్పటికీ ఆయన బ్యాటింగ్‌లో పవర్ తగ్గలేదు. సూపర్‌ స్ట్రయిక్‌ రేట్‌తో ఇన్నింగ్స్ చివరలో వస్తూ దంచి కొడుతున్నాడు.

అయితే.. ధోనీ నాయకత్వంలో రాటుదేలిన ప్లేయర్లు ఎందరో ఉన్నారు. వీరిలో ఒక్కడే పతిరణ కూడా. లసిత్ మలింగ బౌలింగ్ యాక్షన్‌తో ఆకట్టుకున్న పతిరణకి ధోనీ మద్దతుగా నిలిచాడు. అతనికి ఎంతో ప్రోత్సాహం అందించాడు. ఈ క్రమంలోనే ధోనీపై ఉన్న ప్రేమను పతిరణ మాటల్లో చెప్పాడు. ఈ మేరకు అతను మాట్లాడుతూ.. తన తండ్రి తర్వాత.. క్రికెట్‌ జీవితంలో ఆ పాత్రను పోషిస్తున్న వ్యక్తి ఎంఎస్ ధోనీ అని చెప్పాడు. ఎప్పుడూ వెన్నంటే ఉంటూ సలహాలు ఇస్తూ ముందుకు నడిపిస్తున్నట్లు చెప్పాడు. ఇంటి వద్ద ఉన్నప్పుడు నాన్న తోడుగా ఎలా ఉంటారో.. ఇక్కడ గ్రౌండ్‌లో దోనీ కూడా అలాంటి సహకారమే అందిస్తున్నాడని పతిరణ చెప్పాడు. ధోనీ మాటలు తనలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపాయని పతిరణ అన్నాడు.

ధోనీ ఐపీఎల్‌ కు కూడా దూరం అవుతాడని గత రెండు సీజన్లుగా ప్రచారం జరుగుతోందని పతిరణ అన్నాడు. కానీ.. ఆయన ప్రస్తుతం ఫినిషర్‌ పాత్రను పోషిస్తూ.. ధనాధన్‌ ఇన్నింగ్స్‌ను ఆడుతున్నాడని చెప్పాడు. అందుకే ధోనీ భాయ్‌ వచ్చే సీజన్‌లో కూడా ఆడాలని తాను కోరుకుంటున్నట్లు పతిరణ అన్నాడు. ప్రతి ఆటగాడిలో నమ్మకం ఎలా కలిగించాలో ధోనీకి బాగా తెలుసనీ..ఇది మరే వ్యక్తికి తెలియదని పతిరణ అన్నాడు. ప్రస్తుత సీజన్‌లో పతిరణ కేవలం 6 మ్యాచుల్లో 13 వికెట్లు తీశాడు.

Next Story