పంత్ మరో దారుణమైన ఫెయిల్యూర్

ఐపీఎల్ 2025 లో విధ్వంసకర ఆటగాడు రిషబ్ పంత్ దారుణ ఆటతీరు కొనసాగుతూ ఉంది.

By Medi Samrat
Published on : 4 April 2025 8:35 PM IST

పంత్ మరో దారుణమైన ఫెయిల్యూర్

ఐపీఎల్ 2025 లో విధ్వంసకర ఆటగాడు రిషబ్ పంత్ దారుణ ఆటతీరు కొనసాగుతూ ఉంది. ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో పంత్ కేవలం 2 పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు. 6 బంతులు ఆడిన పంత్ ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో సబ్ స్టిట్యూట్ ఫీల్డర్ కార్బిన్ బాస్చ్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ సీజన్ లో పంత్ ఆడిన నాలుగు మ్యాచ్ లలో 15 పరుగులు మాత్రమే అత్యధికం. ఆ తర్వాత సింగిల్ డిజిట్ కే పంత్ పరిమితమయ్యాడు.

ల‌క్నో వేదిక‌గా ముంబ‌యి ఇండియ‌న్స్‌ (ఎంఐ), ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ) మ‌ధ్య జ‌రుగుతున్న ఐపీఎల్ 16వ మ్యాచ్‌లో మొద‌ట టాస్ గెలిచిన ముంబ‌యి కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడు. రోహిత్ శ‌ర్మ ప్రాక్టీస్ సంద‌ర్భంగా గాయ‌ప‌డ‌డంతో ఈ మ్యాచ్‌కు దూర‌మైన‌ట్లు హార్దిక్ వెల్లడించాడు. అలాగే ల‌క్నో జ‌ట్టులోకి మీడియం పేస‌ర్ ఆకాశ్ దీప్‌ను తీసుకున్న‌ట్లు కెప్టెన్ పంత్‌ తెలిపాడు.

Next Story