ఫైనల్‌కు ముందు ఆ సీనియర్ బ్యాట్స్‌మెన్‌ను జట్టులోకి తీసుకోవాలని ప్రయత్నాలు.. పాక్‌కు భారీ అవమానం
ఆసియా కప్ 2025 ఫైనల్ ఇప్పటి నుండి కొన్ని గంటల్లో ప్రారంభమవుతుంది.
By - Medi Samrat |
ఆసియా కప్ 2025 ఫైనల్ ఇప్పటి నుండి కొన్ని గంటల్లో ప్రారంభమవుతుంది. ఆదివారం దుబాయ్ స్టేడియంలో భారత్-పాక్ మధ్య టైటిల్ పోరు జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌కు ముందు పాక్ మాజీ కెప్టెన్ బాబర్ అజామ్‌కు సంబంధించి ఓ పెద్ద అప్‌డేట్ బయటకు వచ్చింది. పాకిస్థాన్ మాజీ కెప్టెన్లు బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ ప్రస్తుతం టీ20 జట్టుకు దూరంగా ఉన్నారు.
క్రికెట్ పాకిస్తాన్‌లోని ఒక నివేదిక ప్రకారం.. ఆసియా కప్ 2025 గ్రూప్ స్టేజ్ మ్యాచ్, సూపర్ 4 మ్యాచ్‌లో భారత్‌తో ఓడిపోయిన తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు బాబర్ అజామ్‌ను జట్టులోకి తీసుకోవాలని కోరింది. అయితే, ఆసియా కప్ 2025 నిర్వాహకులు అభ్యర్థనను తిరస్కరించారు. జట్టులో ఇప్పటికే ఉన్న సభ్యుడు గాయపడినట్లయితే మాత్రమే ఒక ఆటగాడిని మిడ్-టోర్నమెంట్‌లో చేర్చుకోవచ్చని చెప్పారు. బాబర్ ఆజం డిసెంబర్ 2024లో దక్షిణాఫ్రికాతో తన చివరి టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడాడు.
నివేదిక ప్రకారం.. "బాబర్ అజామ్ దక్షిణాఫ్రికాతో T20 సిరీస్‌కు తిరిగి రావచ్చు. బ్యాటింగ్ ఆర్డర్‌లో నిరంతర వైఫల్యం కారణంగా.. సీనియర్ బ్యాట్స్‌మన్ కొరత ఉంది. కెప్టెన్‌గా, ఆటగాడిగా సల్మాన్ అలీ అగా పాత్రపై నిర్ణయం ఆసియా కప్‌లోని మిగిలిన మ్యాచ్‌లో అతని ప్రదర్శనపై ఆధారపడి ఉంటుంది.
ఇటీవల భారత్‌పై రెండు పరాజయాల తర్వాత, బాబర్ అజమ్‌ను తిరిగి జట్టులోకి తీసుకోవాలని పిసిబి అధికారులు ఆదేశించారు. కొద్ది రోజుల క్రితం, ఈ సీనియర్ బ్యాట్స్‌మన్‌ను ఆసియా కప్ కోసం యుఎఇకి పంపాలని కూడా నిర్ణయించారు.. అయితే జట్టులో ఉన్న ఏ ఆటగాడు గాయపడకపోతే.. ఎటువంటి మార్పులు చేయలేమని నిర్వాహకులు బోర్డుకు స్పష్టం చేశారు.
బాబర్ కెరీర్‌పై ఓ లుక్కేద్దాం..
బాబర్ ఆజం 7 సెప్టెంబర్ 2016న ఇంగ్లండ్‌పై T20 అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అతని కెరీర్‌లో ఇప్పటివరకు ఆడిన 128 T20 ఇంటర్నేషనల్స్‌లో 121 ఇన్నింగ్స్‌లలో 39.83 సగటు మరియు 129.22 స్ట్రైక్ రేట్‌తో 4,223 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్‌లో బాబర్ 36 అర్ధ సెంచరీలతో పాటు 3 సెంచరీలు సాధించాడు. ఈ ఫార్మాట్‌లో అతని అత్యుత్తమ స్కోరు 122 పరుగులు. బాబర్ కెప్టెన్సీలో పాకిస్థాన్ జట్టు 85 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడింది. అందులో 48 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. 29 మ్యాచ్‌లలో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. ఒక మ్యాచ్ టై కాగా.. ఏడు అసంపూర్తిగా మిగిలిపోయాయి.