భారత్‌కు రావడానికి పాక్‌ భయపడుతోందా.? వ‌ర‌ల్డ్‌క‌ప్‌ వేదికలను పరిశీలించేందుకు ఇండియాకు ప్ర‌త్యేక‌ బృందం

Pakistan to send security delegation to India for inspecting WC venues. ప్రపంచకప్ షెడ్యూల్‌ను ఐసీసీ విడుదల చేసిన విష‌యం తెలిసిందే.ఈ నేప‌థ్యంలో పాకిస్తాన్ తమ‌ జట్టును

By Medi Samrat  Published on  1 July 2023 10:51 AM GMT
భారత్‌కు రావడానికి పాక్‌ భయపడుతోందా.? వ‌ర‌ల్డ్‌క‌ప్‌ వేదికలను పరిశీలించేందుకు ఇండియాకు ప్ర‌త్యేక‌ బృందం

ప్రపంచకప్ షెడ్యూల్‌ను ఐసీసీ విడుదల చేసిన విష‌యం తెలిసిందే.ఈ నేప‌థ్యంలో పాకిస్తాన్ తమ‌ జట్టును ప్రపంచ కప్ కోసం భారత్‌కి పంపే ముందు ప్రపంచ కప్ వేదికను పరిశీలించడానికి ఇండియాకు భద్రతా ప్రతినిధి బృందాన్ని పంపడానికి సిద్ధమైంది. ఈద్ సెలవుల తర్వాత.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కొత్త ఛైర్మన్‌ను ఎన్నుకున్న తర్వాత.. భద్రతా ప్రతినిధి బృందాన్ని భారత్‌కు ఎప్పుడు పంపాలో విదేశాంగ, అంతర్గత మంత్రిత్వ శాఖలతో సహా ప్రభుత్వం నిర్ణయిస్తుందని ఇంటర్-ప్రావిన్షియల్ కోఆర్డినేషన్ (స్పోర్ట్స్) మంత్రిత్వ శాఖ అధికారిక మూలం తెలిపింది.

పీసీబీ నుండి భద్రతా ప్రతినిధి బృందం ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈ బృందం పాకిస్తాన్ ఆడే మ్యాచ్‌ల వేదికలను తనిఖీ చేస్తుంది. అలాగే ప్రపంచ కప్‌లో వారి కోసం చేసిన భద్రత, ఇతర ఏర్పాట్లను కూడా పరిశీలిస్తుంది. టోర్నమెంట్‌కు వెళ్లే ఆటగాళ్లు, అధికారులు, అభిమానులు, మీడియాకు భద్రత, ఇతర ఏర్పాట్లను చర్చించడానికి, తనిఖీ చేయడానికి ప్రతినిధి బృందం భారత అధికారులతో సంభాషిస్తుందని నివేదిక‌లు తెలిపాయి.

తనిఖీ సమయంలో ప్రతినిధి బృందం ఏవైనా విష‌యాలు సరిగ్గా కనుగొనలేకపోతే.. పీసీబీ ఆ నివేదికను ఐసీసీ, బీసీసీఐతో కూడా పంచుకుంటుంది. క్రికెట్ మాత్ర‌మే కాకుండా ఇతర క్రీడల్లో కూడా.. సంబంధిత జాతీయ సమాఖ్యలు తమ జట్టును భారత్‌కు పంపేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

ఆగస్టులో చెన్నైలో జరిగే ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్తాన్ హాకీ సమాఖ్య ప్రభుత్వ అనుమతి కోసం వేచి ఉంది. ఇటీవల జాతీయ ఫుట్‌బాల్ జట్టు కూడా ప్రభుత్వం నుండి ఎన్ఓసీ పొందిన తర్వాత మాత్రమే బెంగళూరులో జరిగే ఎస్ఏఎఫ్ఎఫ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన‌డానికి భారత్‌కు వ‌చ్చింది.


Next Story